చంద్రబాబుని చూసి ” ఇదేందయ్యా ఇది ” అంటున్న ఏపీ ప్రజలు !

chandrababu in assembly

 నిన్న మొదలైన అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగాయి. అధికారపక్షము , ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ అసెంబ్లీని హీటెక్కించాయి, ఒక దశలో సహనం కోల్పోయిన చంద్రబాబు నాయుడు ఏకంగా స్పీకర్ వెల్ లోకి దూసుకొని అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేయటంతో, ఇక చేసేది ఏమి లేక చంద్రబాబుతో సహా 13 మంది టీడీపీ ఎమ్మెల్యే ల మీద ఒక రోజు సస్పెండ్ వేటు వేయటం జరిగింది.

chandrababu in assembly

 నిన్నటి అసెంబ్లీలో చంద్రబాబు వ్యవహరించిన తీరు చూసి అందరు షాక్ అవుతున్నారు, గతంలో ఎన్నడూ లేని విధంగా బాబు స్పీకర్ వెల్ లోకి వచ్చి నిరసన తెలపటం చాలా విచిత్రంగా ఉంది. గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోడియం వద్దకు పంపించి నిరసన తెలియచేశాడు, ఇలా ఎప్పుడు స్వయంగా వెళ్లిన దాఖలాలు లేవు. నిజానికి చంద్రబాబుకు అసలు అసెంబ్లీ కి వచ్చే ఆలోచన కూడా లేదని, 151 మంది సభ్యుల ముందు తాను నిలబడలేనని తెలిసిన కానీ, చేజారిపోతున్న పార్టీ ఎమ్మెల్యే లను కాపాడటం కోసం, అసెంబ్లీ లో ఎదో చేయబోతున్నాం అని తమ అనుకూల మీడియాలో వార్తలు కోసం అసెంబ్లీకి వచ్చాడు.

 వచ్చిన కొద్దీ సమయంలో తన అసలైన అజెండా బయటకు తీసి, సభ నుండి సస్పెండ్ అయ్యాడు. వాస్తవానికి ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాటం చేయాలనుకున్న ప్రతిపక్షాలు సహనంతో ఉండాలి. తమ వంతు వచ్చే వరకు వేచి చూసి సవివరంగా మాట్లాడాలి. కానీ బాబు దానికి భిన్నంగా అసలు అసెంబ్లీకి వచ్చిందే సస్పెన్షన్ వేటు వేయించుకునేందుకే అన్నట్టుగా వింతగా ప్రవర్తించారు. తుపాను సమయంలో జరిగిన నష్టంపై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ టీడీపీ సభ్యులు పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు.

 సభలో చర్చ జరక్కుండా గందరగోళం సృష్టించారు. చంద్రబాబు వ్యవహారశైలి చూస్తే ఆయన ఎంత ఫ్రస్టేషన్లో ఉన్నారో, సస్పెన్షన్ వేటు వేయించుకొని ఇంటికెళ్లడానికి ఎంత ఆత్రుతగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. నిన్న ఎంటైర్ అసెంబ్లీ లో చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ చూసిన జనాలు ఇదేందయ్యా ఇది బాబు ఇంత ఫైర్ అయ్యారంటూ మాట్లాడుకుంటున్నారు.