AP: ఏపీ సీఎం చంద్రబాబు పేరు మర్చిపోయిన గవర్నర్…. ఇది నిజంగా అవమానమే!

AP: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. నేడు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశాలలో భాగంగా ముందుగా గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అయితే ఈయన ప్రసంగం మొదలైన పది నిమిషాలకే అసెంబ్లీకి హాజరైన వైసిపి నేతలు బయటకు వెళ్లిపోయారు.. అనంతరం గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరును పలుకుతూ తప్పుగా మాట్లాడటంతో ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సంచలనంగా మారాయి.

ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ…ఏపీ ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే తన ప్రసంగంలో తడబడ్డారు గవర్నర్. ఏపీ సీఎం నారా చంద్రబాబు పేరు మరిచిపోయారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర చంద్రబాబు అంటూ మాట్లాడటంతో ఇది కాస్త తీవ్రత స్థాయిలో చర్చలకు కారణం అవుతుంది .

గవర్నర్ నారా చంద్రబాబు నాయుడుకు బదులుగా నరేంద్ర చంద్రబాబు అని పలకడంతో ఈయన ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చంద్రబాబు పేర్లు ఇతరకి కలిపి మాట్లాడారు దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును గవర్నర్ మర్చిపోవడం అంటే నిజంగా అది అవమానకరమైన అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల పేర్లను మర్చిపోతూ ఇతరుల పేర్లు పలకడం చర్చలకు కారణం అవుతుంది.

ఇక గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును కూడా పలకడంలో చాలామంది తడబడుతూ తప్పుగా మాట్లాడిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరును కూడా గవర్నర్ మర్చిపోయి నరేంద్ర చంద్రబాబు అని పలకటంతో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారింది.