Vallabhaneni Vamshi: టీడీపీ పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈయన గన్నవరం నుంచి పోటీ చేసి ఓటమిపాలు అయ్యారు అయితే గతంలో తెలుగుదేశం పార్టీ గురించి తెలుగుదేశం పార్టీ ఆఫీసులపై దాడి కేసులో భాగంగా వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈయనపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కేసులు నమోదు చేశారు. ఒక కేసు నుంచి బెయిల్ రావడంతో మరొక కేసులో అరెస్టు చేస్తూ వచ్చారు.
ఇక ఇటీవల ఈయన పై నమోదు అయిన అన్ని కేసులలో కూడా బెయిల్ రావడంతో వల్లభనేని వంశీ షరతులతో జైలు నుంచి బయటకు వచ్చారు. ఈయనపై నమోదు అయిన కేసులను దృష్టిలో పెట్టుకున్న కోర్టు ఈయనని గన్నవరం విడిచి ఎక్కడికి వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. ఇక ఆరోగ్య సమస్యలు నిమిత్తం గన్నవరం దాటి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా కోర్ట్ అనుమతి తీసుకుని వెళ్లాల్సి ఉంటుందని షరతులు విధించారు.
ఇకపోతే జైలు నుంచి బయటకు వచ్చిన వంశిని స్వాగతించడానికి పెద్దగా వైసిపి నాయకులు రాకపోవడం గమనార్హం. కేవలం పేర్ని నాని మాత్రమే వచ్చారు అయితే ఈయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్దగా మీడియాతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. మౌనంగా తన కారులో వెళ్లిపోయారు. ఇలా వంశీ మౌనంగా ఉండటంతో పెద్ద ఎత్తున రాజకీయాలపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే పేర్ని నాని మాట్లాడుతూ… వంశీ మళ్లీ రాజకీయాల్లోకి రాగలరని ఆశిస్తున్నట్టు చెప్పారు. “ఇప్పుడు కాకపోయినా నాలుగు సంవత్సరాల తర్వాత వంశీ తిరిగి రాజకీయ రంగంలోకి వస్తారు” అన్నారు. ఇది గన్నవరం నియోజకవర్గ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
వైసిపి పార్టీ నేతల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆయన రాజకీయాల పట్ల పూర్తిగా ఆసక్తి కోల్పోయారని కేవలం తన ఆరోగ్యం పైనే దృష్టి పెడుతున్నారని తెలుస్తుంది. ఆరోగ్యపరంగా పూర్తిగా కోలుకున్న తరువాతనే తిరిగి రాజకీయాలపై దృష్టి సారించబోతున్నట్లు వైసీపీ నాయకులు తెలియజేస్తున్నారు.