ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైనా సరే ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న కానీ ఆయనకు కొన్ని ప్రధాన ప్రభుత్వ శాఖల నుండి మద్దతు లభించటం లేదు. ఇప్పటికే కీలకమైన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు తాము మద్దతు ఇవ్వలేమని తేల్చి చెప్పింది, ఇప్పుడు తాజాగా మరో కీలక శాఖ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు సైతం తాము ఎన్నికల నిర్వహణలో పాల్గొనలేమని సృష్టం చేశారు.
కోర్టులో పోరాడుతాం
ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు ఏపీలో లేవని.. అందరికంటే ఎక్కువగా భారం పడేది పోలింగ్ సిబ్బంది అయిన తమపైనే అన్ని ఏపీ ఉద్యోగ సంఘాలు నేతలు స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకు ఏ ఉద్యోగులు ముందుకు రారని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తమ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఉద్యోగులు కోరారు.నిమ్మగడ్డ ఒకవేళ ఎన్నికల నిర్వహణకే ముందుకెళితే తాము కోర్టును ఆశ్రయిస్తామని నేతలు హెచ్చరించారు.
ప్రాణాలకు రక్షణ ఎక్కడుంది..?
ఎన్నికల కారణంగా కరోనా వ్యాపించే అవకాశం ఉందని, ఇప్పటికే లాక్ డౌన్ లో 11వేల మంది పోలీసులు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనా బారినపడ్డారని.. పోలీసులు ఉద్యోగుల్లో వందల మంది చనిపోయారని కళ్ళ ముందు ఇన్ని జరుగుతున్నా కానీ ఎన్నికల నిర్వహణ అంటే తమకు కష్టమని అందుకే ఈ విషయంలో ఎన్నికల కమీషన్ మరోసారి ఆలోచించాలని ‘ఏపీఎన్జీవో’ డిమాండ్ చేసింది.
నిమ్మగడ్డ ఆలోచనలు ఎటు వైపు
ఎన్నికల నిర్వహణలో కీలకమైన ప్రభుత్వ ఉద్యోగులు ససేమిరా కష్టం అని చెప్పటం ఎన్నికల కమీషన్ కు పెద్ద షాక్ అనే చెప్పాలి. వాళ్ళ మద్దతు లేకుండా ఎట్టి పరిస్థితులో ముందుకు వెళ్ళటం కుదరని పని, కాదు కూడదని ఎన్నికలకు వెళితే, ఉద్యోగులు కోర్టు కు వెళ్ళటం ఖాయం, ఒక్క సారి కోర్టు కు వెళితే ఈ పంచాయితీ తేలటానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఈ లోపే నిమ్మగడ్డ పదవి కాలం కూడా పూర్తికావటం జరుగుతుంది. మరి దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.