Roja: రోజాకు హ్యాండ్ ఇచ్చిన జగనన్న…. చేసిన సహాయం మర్చిపోతారంటూ షాకింగ్ పోస్ట్ చేసిన రోజా!

Roja: వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ఏపీలో తన పార్టీని పునర్నిర్మించుకోవడానికి సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈయన నియోజకవర్గ ఇన్చార్జులను కూడా మారుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నగరి నియోజకవర్గంలో కూడా రోజాకు గట్టి షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. గత ఎన్నికలలో రోజా ఓటమి పాలపడమే కాకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుమారు 50 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఇలా గాలి భాను ప్రకాష్ కి భారీ స్థాయిలో మెజారిటీ రావడంతో నగరి నియోజకవర్గంలో రోజా పట్ల ఇంతటి వ్యతిరేకత ఏర్పడిందో స్పష్టం అవుతుంది ఈ క్రమంలోనే నగరి నియోజకవర్గంలో గాలి ముద్దుకృష్ణమ నాయుడు చిన్న కుమారుడు వైసిపి లోకి రాబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రోజా ఈ విషయంలో పూర్తిగా అలిగి ఉన్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి.

ఇలా రోజా జగన్మోహన్ రెడ్డి తీరుపై అసలు తృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి వార్తలు పై రోజా ఎక్కడ స్పందించలేదు. అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ మాత్రం సంచలనంగా మారడమే కాకుండా ఈ పోస్ట్ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేశారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే రోజా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… హెల్ప్ అనేది చాలా విచిత్రమైనది… చేస్తే మర్చిపోతారు చేయకపోతే గుర్తుపెట్టుకుంటారు అంటూ ఈమె పోస్ట్ చేశారు. అయితే రోజా ఈ పోస్టు ఎవరిని ఉద్దేశించి చేశారన్నది ప్రస్తుతం చర్చలకు కారణమైంది. కచ్చితంగా ఈ పోస్ట్ రోజా జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేశారని తెలుస్తుంది. ఈమె పార్టీ కోసం ఎంతో సహాయం చేసినప్పటికీ ఆ సహాయాన్ని పూర్తిగా మర్చిపోయి ఇప్పుడు తనని పక్కకు తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఉద్దేశంతోనే ఇలాంటి పోస్ట్ చేశారని స్పష్టమవుతుంది.