Home Andhra Pradesh ఏపీ మాజీమంత్రి 'పట్నం సుబ్బయ్య' హఠాన్మరణం !

ఏపీ మాజీమంత్రి ‘పట్నం సుబ్బయ్య’ హఠాన్మరణం !

ఏపీ మాజీ మంత్రి, చిత్తూరు జిల్లాకు చెందిన బీజేపీ నేత పట్నం సుబ్బయ్య అనారోగ్యం కారణాలతో తుదిశ్వాస విడిచారు. ఐరాల మండలంలోని కొత్తపల్లిలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్ది కాలం క్రితం ఆయన గుండె సంబంధిత ఆపరేషన్ చేయించుకున్నారు. పలమనేరులో ప్రభుత్వ డాక్టర్‌ గా పని చేసిన సుబ్బయ్య, ఎన్టీఆర్ పిలుపు మేరకు టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Former Ap Minister Patnam Subbaiah Dead

టీడీపీ హయాంలో ఆయన పౌరసరఫరాల శాఖ, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక.. పట్నం సుబ్బయ్య ప్రాధాన్యం క్రమంగా తగ్గింది. నాలుగోసారి పట్నం సుబ్బయకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నిరాకరించారు. పలమనేరు అభ్యర్థిగా లలిత కుమారికి అవకాశం ఇచ్చారు. దీంతో పట్నం సుబ్బయ్య రాజకీయ జీవితం ముగిసింది.

2014లో సుబ్బయ్య బీజేపీలో చేరారు. పార్టీ ఆయనకు రాష్ట్ర స్థాయిలో సముచిత స్థానం ఇచ్చింది. కానీ 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడంతో ఆయన మళ్లీ కమలం గూటికి చేరారు.రెండు సార్లు మంత్రిగా పనిచేసిన సుబయ్య.. సాధారణ జీవితం గడిపారు. ఒకప్పుడు మంత్రి హోదాలో ఉన్న ఆయన.. అనంతరం స్కూటర్‌పై తిరిగేవారు. పట్నం సుబ్బయ్య మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతలు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

 

- Advertisement -

Related Posts

అమెరికా ఇండియాకి ఎన్ని లక్షల కోట్లు బాకీ ఉందంటే ?

అమెరికా అంటే ప్రపంచ పెద్దన్న. ప్రపంచంలోని చాలా దేశాలకు అప్పులిస్తుంది. అయితే, ఆ దేశం కూడా అప్పులు చేస్తుంది. అంతా ఇంతా కాదు. భారీ ఎత్తున అప్పులు చేస్తోంది. అభివృద్ది చెందిన దేశంగా...

మూడో కూటమిగా కమల్‌హాసన్-శరత్‌ కుమార్… రంజుగా మారుతున్న తమిళ రాజకీయం!

చెన్నై: డీఎంకే కూటమి నుంచి నటుడు శరత్‌ కుమార్‌ బయటకు వచ్చి కమల్‌హాసన్ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం పార్టీతో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాడు రాజకీయాలలో రోజురోజుకు వేడి...

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు … మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో బరిలో 93 మంది !

తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఫైనల్ అయ్యారు. నామినేషన్ల పరిశీలనలో కొంతమంది నామినేషన్లు రిజక్ట్ కాగా , నామినేషన్ల ఉపసంహరణలో కొంతమంది విత్ డ్రా చేసుకున్నారు. మహబూబ్‌నగర్-...

పబ్లిసిటీ పీక్… మ్యాటర్ వీక్ అంటూ జగన్ మీద లోకేష్ సెటైర్లు

ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ చేస్తూ హై కోర్ట్ ఉత్తర్వులివ్వటంతో రాజకీయ పార్టీలన్నీ వ్యూహ రచనలో మునిగిపోయాయి. మున్సిపల్ ఎన్నికలు అంటే దాదాపు పట్టణ జనాభా అధికంగా ఉండేవే...

Latest News