ఏపీలో ఇప్పుడు వైసీపీ-ఎన్నికళా కమిషన్ మధ్య పోటీ నడుస్తుంది. ఈ పోటీలో చివరికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గెలిచి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు రమేష్ కుమార్ టీడీపీకి అనుకూలంగా ఉండి వైసీపీని ఇబ్బందుల్లో పెడుతున్నారని వైసీపీ నాయకులు అనుకున్నారు కానీ ఇప్పుడు రమేష్ కుమార్ ఇప్పుడు టీడీపీకి కూడా షాక్ ఇచ్చారు. టీడీపీకి షాక్ ఇవ్వడంతో వైసీపీ నాయకులు ఆనందంలో ఉన్నారు. కానీ రాజకీయాల్లో మాత్రం ఎంతో అనుభవం ఉన్న సీబీఎన్ మాత్రం ఇప్పుడు ఇలాంటి తప్పు ఎలా చేశారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.
టీడీపీకి షాక్ ఇచ్చిన నిమ్మగడ్డ
ఇప్పటి వరకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కు వైసీపీకి మాత్రమే షాక్ లు ఇస్తూ వచ్చారు. అయితే మొదటిసారి టీడీపీకి షాక్ ఇచ్చారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు స్థానిక ఎన్నికల విషయంలో ఎవ్వరూ ఊహించని తప్పు చేశారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఒక మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోను రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. అయిన స్థానిక ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చెయ్యడం ఏంటని వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే బాబు కూడా ఇలాంటి పొరపాట్లు చెయ్యడం ఏంటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
బాబుకు చాదస్తం పెరిగిందా!!
బాబుకు వయసు పెరుగుతున్న కొద్దీ చాదస్తం పెరుగుతున్నట్టు ఉంది, అలాగే ఆయన తీసుకుంటున్న నిర్ణయాల్లో కూడా పస తగ్గుతుంది. రాజకీయాల్లో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న బాబుకు కూడా ఇప్పుడు ఇలాంటి చిన్న తప్పులు చేస్తూ నవ్వుల పాలు అవుతున్నారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న బాబు టీడీపీని మళ్ళీ ఎలా అధికారంలోకి తీసుకు వస్తారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.