చంద్రబాబుకు షాకిచ్చిన ఏపీ డీజీపీ.. ? 

 

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు, డీజీపీ గౌతం సవాంగ్ రాసిన లేఖతో ఖంగ్ తిన్నారట.. చంద్రబాబు ఆరోపించినట్లుగా ఈ ఘటనతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు ఎటువంటి సంబంధం లేదని, నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం తగదని.. మీడియాకు లేఖలు ఇచ్చే ముందు వాస్తవాలను పరిశీలించి అడుగువేయాలని సున్నితంగా హెచ్చరించారట డీజీపీ గౌతం సవాంగ్.. ఇంతకు ఏం జరిగిందని ఆలోచిస్తున్నారా.. ఆ వివరాలు తెలుసుకుంటే.. చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో సస్పెన్షన్ లో ఉన్న జస్టిస్ రామకృష్ణ సోదరుడు రామచంద్రపై రెండు రోజుల క్రితం దాడి జరిగిందన్న విషయం తెలిసిందే.. అయితే ఈ దాడి విషయం ఎప్పుడైతే వెలుగు చూసిందో వెంటనే చంద్రబాబు, లోకేష్ తో పాటు యావత్ టీడీపీ నేతలు ప్రభుత్వంపై మండిపడ్డారు. రామచంద్రపై వైసీపీ గుండాలు ఉద్దేశ్యపూర్వకంగానే దాడులు చేసినట్లు ట్విటర్లోను, టీడీపీ నేతలతో జరిగిన జూమ్ కాన్ఫరెన్సులో ఆరోపణలు చేశారు..

ఇక ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగి పోలీసులు చేసిన దర్యాప్తులో వెల్లడయిన నిజాలకు ముందుగా పోలీసులు ఆశ్చర్య పోయారట.. తర్వాత జరిగిన వాస్తవాలను వివరిస్తూ డీజీపీ, చంద్రబాబుకు తాజాగా లేఖ రాశారు. ఇకపోతే మదనపల్లిలో ఉంటున్న ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి టీడీపీ కార్యకర్తగా ఉంటున్నారు. కాగా మదనపల్లి మార్కెట్లో ప్రతాప్ రెడ్డికి, తోపుడుబండి వ్యాపారికి జరుగుతున్న గొడవలోకి రామచంద్ర కూడా వెళ్ళాడట.. దీంతో రామచంద్రకు, ప్రతాప్ రెడ్డికి మద్య గొడవ పెద్దదయిపోగా, పట్టరానికోపంతో ఉన్న ప్రతాప్ రెడ్డి ఇనుపరాడ్ తో రామచంద్ర తలపై బలంగా కొట్టడం జరిగిందట.. అయితే ఈ విషయాన్ని ప్రతాప్ స్వయంగా రెడ్డే పోలీసుల దగ్గర అంగీకరించాడని సమాచారం..

కాగా విషయాన్ని డీజీపీ, చంద్రబాబుకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. మరి వాస్తవం ఇదైతే రెండు రోజులుగా చంద్రబాబు, చినబాబు అండ్ కో ప్రభుత్వం మీద బురద చల్లేయటం ఏమిటి.. రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా దాన్ని వెంటనే ప్రభుత్వానికి ఆపాదించేసి వైఎస్ జగన్ ను నిందలపాలు చేయలనుకుంటే ఇలాంటి షాకులే తగులుతాయన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని అంటున్నార్ట వైసీపీ సానుభూతిపరులు..