YS Jagan: వైసీపీలోకి కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తున్న జగన్…. పథకం ప్రకారమే ఆహ్వానాలు?

YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓటమిపాలు అయిన తర్వాత తిరిగి తన పార్టీని నిలబెట్టుకోవడం కోసం సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే ఇటీవల జగన్ 2.0 ఓ అంటే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి చూపిస్తా అంటూ కూడా సవాల్ విసిరారు. అయితే ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు వేదికగా సరికొత్త రాజకీయ వ్యూహం రచించబోతున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఇప్పటికే వైసీపీ పార్టీ నుంచి ఎంతోమంది కీలక నాయకులు బయటకు వెళ్లిపోయారు. మరికొందరు రాజీనామాలు కూడా చేశారు ఈ నేపథ్యంలోనే బలమైన నాయకులను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని భావిస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డికి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా రాజకీయం అంటేనే కాంగ్రెస్ పార్టీ అనేలాగే ఉంది తన తండ్రి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు ఇక ఏపీలో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్ పార్టీదే అని చెప్పాలి.

ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా కాస్తో కూస్తో ఉన్న కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన తండ్రి హయాంలో మంత్రులుగాను ఎంపీలు గాను, ఎమ్మెల్యేలుగాను పనిచేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులను తిరిగి తన పార్టీలోకి ఆహ్వానించబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది సీనియర్లకు ఆహ్వానాలు అందాయని తెలుస్తుంది .

ఇప్పటికే మాజీ మంత్రి శైలజనాథ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరి కొంత మంది వైసీపీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా ఏపీలో కాంగ్రెస్ పార్టీని పూర్తిస్థాయిలో బలహీన పరుస్తూ కాంగ్రెస్ నాయకులను తన వైపుకు తిప్పుకుంటూ తిరిగి వైసిపి పార్టీని బలోపేతం చేయడం కోసం జగన్ కాంగ్రెస్ పార్టీని వైసీపీలోకి విలీనం చేయబోతున్నారని తెలుస్తోంది. ఇలా కాంగ్రెస్ సీనియర్ నాయకులను తన వైపుకు తిప్పుకుంటూనే తన చెల్లి షర్మిలపై కూడా ఊహించని దెబ్బ కొడుతున్నారని తెలుస్తోంది.