ప్రజల సొమ్ముతో ఇన్‌కం ట్యాక్స్‌ కట్టిన సీఎం…ఇదెక్కడి న్యాయం!

ap cm ys jagan delhi tour

ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి తన హవా చూపిస్తున్నారు. సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకుంటూనే.. అదే స్థాయిలో ఎన్నికలను సైతం క్లీన్‌ స్వీప్‌ చేసేశారు. ఇప్పుడు జగన్‌ ఆదాయపు పన్ను కట్టాల్సి వచ్చింది. ఆయన పన్ను కోసం రూ.7 లక్షల 14 వేలను ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసింది. ఆయనతోపాటు మరో మంత్రి పేర్ని నాని కట్టాల్సిన ఆదాయపు పన్నును కూడా ప్రజల పన్నుల రూపంలో చెల్లించిన సొమ్ము నుంచి విడుదల చేశారు. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు.

Jagan

అయితే, ఇప్పుడు దీనిపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి ఆదాయపు పన్నను ప్రజల పన్నుల రూపంలో కట్టిన సొమ్ము నుంచి ఎందుకు రిలీజ్‌ చేయాలని.. ఆయన వ్యక్తిగతంగా చెల్లించుకోవచ్చు కదా.. అనే సందేహాలు వినిపిస్తున్నాయి. జగన్‌ సీఎం కాబట్టి.. సీఎంగా ఆయన ఆర్జించిన మొత్తానికి కూడా పన్నును ప్రజలే కట్టాలని అర్థం చేసుకోవాలి. ఇక్కడ సీఎం జగన్ వ్యక్తిగత ఆదాయంపై ఈ పన్ను మొత్తాన్ని కట్టలేదని మనం అర్థం చేసుకోవచ్చు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి ద్వారా వచ్చిన ఆదాయం పైనే ప్రజల పన్నుల సొమ్ముతో పన్ను కట్టడానికి చాన్స్ ఉంటుంది.

ముఖ్యమంత్రిగా ఉన్నందున.. తనకు బయట వ్యాపారాల ద్వారా లభించిన ఆదాయానికి ప్రజల సొమ్ముతో పన్ను కట్టడానికి ఉండదు. ఒకవేళ అలా కట్టినట్లయితే అది నేరమే అవుతుంది. అలాంటి వాటికి ఏపీ అధికారులు పాల్పడకపోవచ్చని భావిస్తున్నారు. సీఎంగా జగన్ జీతభత్యాలు తీసుకుంటారు. అది ఆదాయపు పన్ను పరిమితికి మించి ఉంటే.. నిబంధనల ప్రకారం పన్ను కట్టాలి. ఆ మేరకు సీఎం జగన్‌కు నెలవారీ ఆదాయం భత్యాలు కలిపి వచ్చే దానిపై ఏడాదికి రూ.7 లక్షల 14 వేల ఆదాయపు పన్ను అయి ఉంటుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్క సీఎం మాత్రమే కాదు.. పేర్ని నాని పన్నులు కూడా ప్రజల సొమ్ముతోనే కట్టేశారు.ఇక్కడ ప్రజలు పన్నుల రూపంలో కట్టే సొమ్మునే జీతంగా తీసుకుంటున్నారు. అందులో నుంచే పన్ను కట్టాలి. మళ్లీ పన్నుల కోసం ప్రజాధనాన్ని ఉపయోగించుకోవడం నైతికత కాదు.