అలా జరిగితే.. చంద్రబాబు గెలిచినట్టు? జగన్ ఓడిపోయినట్టు?

ap cm ys jagan and tdp president chandrababu

అదేంటి.. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయారు కదా.. మళ్లీ ఇప్పుడు ఏవిధంగా గెలుస్తారు అనే డౌట్ మీకు రావచ్చు. నిజానికి.. గెలుపంటే ఎన్నికల్లోనే కాదు.. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది జరిగితే.. దాన్ని కూడా గెలుపు అనొచ్చు.

ap cm ys jagan and tdp president chandrababu
ap cm ys jagan and tdp president chandrababu

అంటే.. చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఓడిపోయారు ఓకే. ఆ తర్వాత కూడా ఆయనకు ఏమాత్రం కలిసిరావడం లేదు. గ్రహాల ప్రభావం కావచ్చు. ఏది ఏమైనా.. 2019 నుంచి ఆయనకు ఇప్పటి వరకు పెద్దగా మంచి పరిణామాలేవీ చోటు చేసుకోలేదు.

కాకపోతే.. రాజధాని కోసం టీడీపీ పోరాటం చేస్తోంది. పోలవరం ప్రాజెక్టుపై కూడా టీడీపీకే దెబ్బ పడుతోంది. ఏపీ అసెంబ్లీలో అయితే.. టీడీపీదే తప్పు అనట్టుగా మాట్లాడుతోంది వైసీపీ. టీడీపీ సరిగ్గా పట్టించుకొని ఉంటే.. పోలవరం ఎప్పుడో పూర్తయి ఉండేదని.. టీడీపీ ఐదేళ్లు ఏం చేసింది.. అంటూ వైసీపీ సభ్యులు గట్టిగానే ఇస్తున్నారు. దీంతో తిరిగి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి టీడీపీది.

కానీ… ఒక్క విషయంలో మాత్రం చంద్రబాబు.. సీఎం జగన్ కన్నా ముందున్నారు. అంటే ఆ విషయంలో మాత్రం తన మాటే నెగ్గుతోంది. అదే స్థానిక సంస్థల ఎన్నికలు. వాటి గురించి చర్చ ఇప్పటి నుంచి నడుస్తున్నది కాదు.. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి అంటే కరోనా రాకముందు నుంచి ఏపీలో స్థానిక సంస్థల గురించి చర్చ సాగుతోంది. మధ్యలో కరోనా రావడంతో ఆ ఎన్నికలకు దెబ్బ పడింది.

కరోనా వల్ల స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయిస్తూ వస్తోంది ఏపీ ప్రభుత్వం. మరోవైపు ఎన్నికల కమిషన్ మాత్రం చాలా దూకుడు మీదుంది. ఇప్పటికే పలుమార్లు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కోర్టుకు వెళ్లింది. హైకోర్టు కూడా ఎన్నికల కమిషన్ వైపే మొగ్గు చూపుతోంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటికే కోర్టు పలుమార్లు విమర్శలు చేసింది. దీంతో వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనేదానిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

చంద్రబాబు కూడా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎస్ఈసీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఎస్ఈసీ నిర్ణయమే సరైందంటూ చెబుతున్నారు. కానీ.. సీఎం జగన్ మాత్రం ఇప్పట్లో ఎన్నికలు వద్దు అంటూ గట్టిగానే చెబుతున్నారు. ఇప్పటికే ఎస్ఈసీ ప్రొసీడింగ్స్ ను నిలిపివేయాలంటూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అంటే.. ఈ విషయంలో జగన్ ఓడిపోయినట్టే కదా? చంద్రబాబు గెలిచినట్టే కదా? ఎస్ఈసీ నిర్ణయించిన ప్రకారం.. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయంటే.. చంద్రబాబు నూటికి నూరు పాళ్లు గెలిచినట్టే. అప్పటి నుంచైనా చంద్రబాబు గ్రాఫ్ పెరుగుతుందో లేదో వేచి చూడాలి.