ఇప్పటి వరకు నార్త్ ఇండియాలో దేవలయాలపై దాడులు జరుగుతూ ఉండేవి, అలాగే అక్కడే కులాల, మతాల ఆధారంగా గొడవలు జరగడం, రాజకీయాలు చెయ్యడం వంటివి ఎక్కువగా జరిగేవి. కానీ ఇప్పుడు ఏపీలో కూడా ఈ రాజకీయాలు మొదలు అయ్యాయి. ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. దేవుళ్ళ విగ్రహాలను పగలకొడుతున్నారు. అయితే ఈ సంఘటనల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని ప్రతిపక్షాల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం గురించి రాష్ట్ర ప్రజలు మొత్తం మాట్లాడుకుంటున్నారు.
మత ప్రభోదకుడు ప్రవీణ్ చక్రవర్తి అరెస్ట్
కాకినాడ కేంద్రంగా మతభోదకుడు ప్రవీణ్ చక్రవర్తి మతాలను కించపరిచే పోస్టులు పెట్టటంతో సీఐడీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. దేవతా విగ్రహాలను కాలుతో తన్ని తలలను తొలగించానంటూ ప్రవీణ్ చక్రవర్తి వ్యాఖ్యలు చేయటం పై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే , ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ప్రవీణ్ చక్రవర్తి వీడియో ఎడాది క్రితం పోస్టింగ్ చేసినప్పటికి ఇప్పుడున్న పరిస్దితులను రెచ్చకొట్టే విధంగా ఉండటంతో ,అది కాస్త వైరల్ అయ్యే ప్రమాదం ఏర్పడటంతో సీఐడీ పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అమరావతి నుండి కాకినాడ వెళ్ళిన సీఐడీ పోలీసులు ప్రవీణ్ చక్రవర్తిని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి సీఐడీ ప్రదాన కార్యాలయం కు తరలించారు.
ప్రజల మన్ననలు పొందుతున్న జగన్
దేవాలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో వైసీపీకి ప్రతిపక్షాల నుండి చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే ఇప్పుడు ప్రవీణ్ విషయంలో వైసీపీ తీసుకున్న నిర్ణయం మాత్రం ప్రజల నుండి జగన్ కు ప్రసంశలు తెస్తుంది. ఈ ఒక్క నిర్ణయంతో దేవాలయాలపై దాడులపై జగన్ ఎంత కఠినంగా ఉంటారో చుపించారు. ఈ ఒక్క నిర్ణయంతో ప్రతిపక్షాల నోళ్ళను జగన్ మూయించారు.