Allu Arjun: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాగే ఏపీ తెలంగాణ రాజకీయాలలో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల తో పాటుగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సంధ్యా థియేటర్ కేసులో భాగంగా అరెస్ట్ అవ్వడం, అనంతరం అల్లు అర్జున్ కి 14 రోజులు రిమాండ్ విధించడం, తర్వాత తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. అయితే ఒక రాత్రి మొత్తం అల్లు అర్జున్ జైల్లో గడిపిన విషయం తెలిసిందే.
కానీ ఎట్టకేలకు అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ జైలుకు వెళ్లినప్పటి నుంచి రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ కి మద్దతుగా కామెంట్స్ చేస్తూనే సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేశారు. అంతేకాకుండా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి మరి కొంతమంది సెలబ్రిటీలు పరామర్శించారు. ముందుగా గీత ఆర్ట్స్ కు వెళ్లిన అల్లు అర్జున్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాడు. ఇక ఉదయం నుంచి సినీ రాజకీయ నాయకులు అల్లు అర్జున్ ను పరామర్శించడానికి ఆయన నివాసానికి వెళ్తున్నారు. కాగా షూటింగ్స్ లో బిజీగా ఉన్న హీరోలు అల్లు అర్జున్ తో ఫోన్ లో మాట్లాడుతున్నారు.
అయితే ఇప్పటికే ఎన్టీఆర్ అల్లు అర్జున్ తో ఫోన్లో మాట్లాడారు. తాజాగా ప్రభాస్ కూడా అల్లు అర్జున్ కు ఫోన్ చేసి పరామర్శించారు. కాగా ఇప్పుడు అల్లు అర్జున్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టై బెయిల్ పై జైలు నుంచి విడుదలైన ఆయనను ఫోన్‌లో సీఎం పరామర్శించారు. నిన్న అల్లు అరవింద్ కు కూడా ఫోన్ చేసిన చంద్రబాబు ధైర్యంగా ఉండాలని సూచించిన సంగతి తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ ని కూడా ఫోన్ ద్వారా పరామర్శించినట్టు తెలుస్తోంది.