AP: రెడ్డి గారి రాజ్యసభ సీటు మరో రెడ్డిగారికేనా…. రేసులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి?

AP: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. అయితే ఇప్పుడప్పుడే ఎన్నికలు కూడా వచ్చే పరిస్థితి లేదు కానీ ఏపీలో మాత్రం రాజకీయ హీట్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి ప్రతిరోజు ఏదో ఒక సంచలన విషయం ఏపీ రాష్ట్ర రాజకీయాలలో చోటు చేసుకుంటుంది. ఇటీవల ఎవరు ఊహించని విధంగా ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా విజయసాయిరెడ్డి వ్యక్తిగత కారణాలవల్ల తాను రాజీనామా చేస్తున్నానని ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటానని తెలియజేశారు. నా రాజీనామా వెనుక ఎవరి ప్రమేయం లేదని క్లారిటీ ఇచ్చారు. విజయ్ సాయి రెడ్డి రాజీనామా చేయడంతో కూటమి ప్రభుత్వం మరొక రాజ్యసభ సీటు ఖరారైంది అనే చెప్పాలి. విజయ్ సాయి రెడ్డి స్థానంలో మరొకరిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీంతో తప్పనిసరిగా కూటమి నేతలే ఆ స్థానాన్ని సొంతం చేసుకుంటారు.

మరి మూడు పార్టీలలో ఏ పార్టీ అభ్యర్థి రాజ్యసభ సీటు సొంతం చేసుకుంటారు అనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే జనసేన పార్టీ తరపున నాగబాబు మరోసారి పెద్దల సభకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారని ఇదే విషయం గురించి పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి తెస్తున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఇక ఇదే విషయం గురించి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన వెంటనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి కూడా కేంద్ర పెద్దలతో చర్చించినట్టు వార్తలు వస్తున్నాయి.

ఇలా విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఆ రాజ్యసభ సీటు ఎవరికి వస్తుందనే ఆత్రుత అందరిలోనూ నెలకొంది అయితే అందుతున్న సమాచారం ప్రకారం కూటమీ పార్టీ నేతలు ఈ సీటును బీజేపీకి కేటాయించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై అమిత్ షాక్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి కూడా చెప్పినట్టు సమాచారం. ఇక ఈ సీటు కనుక బిజెపికి ఇస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.

ఇలా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో అదే సామాజిక వర్గానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించబోతున్నట్టు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అయితే ఇటీవల బీజేపీ పార్టీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడి నుంచి పోటీ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఓటమిపాలు కావడంతో ఈ రూపంలో ఆయనను తిరిగి పార్లమెంట్ కి తీసుకువెళ్లాలని బీజేపీ భావించినట్టు తెలుస్తోంది.