AP: రాయలసీమలో కూటమికి భారీ వ్యతిరేకత… సంచలన విషయాలు బయట పెట్టిన ప్రవీణ్ పుల్లెట్ల!

AP : ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీ సింగిల్ గా పోటీ చేయక మరోవైపు బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ మూడు పార్టీల కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగాయి ఈ మూడు పార్టీలు ఏకంగా 164 స్థానాలలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక 2019 ఎన్నికలలో 151 స్థానాలలో సింగిల్ గా విజయం సాధించిన వైసీపీ పార్టీ 2024 ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇలా అద్భుతమైన మెజారిటీ సాధించిన కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకుంది.

ఇలా ఏడాది పూర్తి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీ పాలన పట్ల సర్వేలు నిర్వహిస్తూ షాకింగ్ విషయాలను బయటపెడుతున్నారు. గత ఎన్నికల సమయంలో కూటమి పార్టీ అధికారంలోకి వస్తుందంటూ సర్వే నిర్వహించిన ప్రవీణ్ పులెట్ల తాజాగా కూటమి ఏడాది పాలన గురించి సంచలనమైన పోస్ట్ చేశారు.రాయలసీమలో అత్యధికంగా కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలను సాధించారు.. అయితే ఇందులో 33 మంది కూటమి ఎమ్మెల్యేల పైన తీవ్ర వ్యతిరేకత ఉన్నదని తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు 33లో 29 మంది గెలవడం కష్టమే అన్నట్లుగా తెలుపుతున్నారు.

ఇలా 33 మందిలో 29 మంది గెలవడమే కష్టం అని తెలియజేయడమే కాకుండా మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న నలుగురు ప్రమాదకర స్థితిలో ఉన్నారని కూడా ప్రవీణ్ తెలిపారు.మొదటిసారి ఎన్నికైన కూటమి ఎమ్మెల్యేలు 90% పైగా అవినీతి ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఇక అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే పై కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయని వ్యతిరేకత ఏర్పడిందని ప్రవీణ్ తెలిపారు. చిత్తూరు పార్లమెంటులో.. కుప్పం, పలమనేరు నియోజవర్గాలు తప్ప మిగిలినవి కూటమి మర్చిపోవడమే మంచిదని తెలిపారు. రాయలసీమ కూటమిలో వైసీపీ నేతలే ఎక్కువ! రైల్వే కోడూరు ఎమ్మెల్యే (వన్ టైమ్) ఎవరు? టీడీపీదే పెత్తనమంతా. కడప ప్రచార ఆర్భాటం ఎక్కువ క్షేత్రస్థాయి ఫలితాలు భిన్నం. ఎస్సీ నియోజకవర్గాలు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రవీణ్ తన సర్వే ద్వారా ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.