టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో అనుష్క పేరు ఇప్పటికీ పదిలంగానే ఉంది. ఆమె సినిమాలు చేయకపోయినా ప్రేక్షకుల్లో ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఆమెతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు. ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క కొత్త సినిమాలేవీ మొదలుపెట్టలేదు. గత లాక్ డౌన్ టైంలో ఓటీటీ ద్వారా ఆ సినిమా విడుదలైంది. అప్పటి నుండి అనుష్క కొత్త సినిమా ఏదీ లాంచ్ కాలేదు. యువీ క్రియేషన్స్ నిర్మాణంలో ఆమె ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో నవీన్ పోలిశెట్టి కూడ లీడ్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే లాంచ్ కావాల్సింది.
కానీ అనుష్క సిద్ధంగా లేకపోవడంతో అది జరగలేదు. కొన్ని నెలలు ప్రాజెక్ట్ ఆలస్యమైంది. తీరా అనుష్క సినిమా చేయడానికి సిద్ధమయ్యేసరికి కరోనా సెకండ్ వేవ్ విజృంభణ మొదలైంది. దాంతో అనుష్క రెడీ అయినా సినిమా మొదలయ్యే పరిస్థితి లేదు. తాజా పరిస్థితులను బట్టి ఈ చిత్రం ఆగష్టు నెలలోనే లాంచ్ అవుతుందని తెలుస్తోంది. అంటే రిలీజ్ 2021 చివర్లో కానీ 2022 ఆరంభంలో కానీ ఉంటుంది. అంటే దాదాపు ఈ ఏడాది అనుష్క నుండి సినిమా లేనట్టే అనుకోవాలి.