అనుష్క సన్నబడిందట: ఇది నిజమేనా.?

Anushka Turns Slim Finally But.. | Telugu Rajyam

లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క నుంచి వచ్చిన సినిమా ‘నిశ్శబ్ధం’. భారీ అంచనాల నడుమ బైలింగ్వల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా అంతే భారీగా నిరాశపరిచింది. ఇక ఆ తర్వాత మళ్లీ స్వీటీ గ్యాప్ తీసుకుంది. అసలు స్వీటీ గ్యాప్‌కి కారణమేంటంటే, ఆమె బరువు.

అప్పుడెప్పుడో ‘సైజ్ జీరో’ కోసం పెంచిన బరువు. తగ్గించడం ఆమె వల్ల కావడం లేదు. ఇదిగో అనుష్క సన్నబడిపోయిందట. అదిగో స్లిమ్ అయిపోయిందట. ఇంకేంటి ఇదిగో ప్రూఫ్.. అంటూ రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి. కానీ, స్వీటీ ఏమాత్రం తగ్గనే లేదు. ‘నిశ్శబ్ధం’ సినిమాలోనూ స్వీటీ చాలా బొద్దుగా కనిపించింది.

ఇక లేటెస్టుగా అనుష్క బాగా సన్నబడిందనే వార్త మరోసారి సోదిలోకి వచ్చింది. ఈ సారి స్వీటీ నిజంగానే తగ్గిందంటున్నారు. చాలా కష్టపడి వర్కవుట్లు చేసిందట. క్రిటికల్ డేట్ ఫాలో చేసిందట. అంతేకాదు, తమిళంలో ఓ సినిమా, తెలుగులో ఓ సినిమాకి అనుష్క సైన్ చేసిందట కూడా..

ఆ సినిమాల కోసమే అనుష్క కష్టపడి సన్నబడిందనీ, త్వరలోనే పబ్లిక్ అప్పియరెన్స్ ఇవ్వనుందనీ తెలుస్తోంది. చూడాలి మరి, ఈ సారేం చేస్తుందో స్వీటీ.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles