ఇంస్టాగ్రామ్ లో అనుష్క ఫాలో అవుతున్న హీరోలు వీళ్లే..వీరు మాత్రమే స్పెషల్…?

దర్శకుడు పూరి జగన్నాథ్ ఎంతో మంది హీరోయిన్లను టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అలా పూరి జగన్నాథ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరోయిన్లలో అనుష్క శెట్టి కూడా ఒకరు నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనుష్క అరుంధతి సినిమాతో లేడీస్ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందింది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన అనుష్క తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈమె అందం, అభినయంతో పాటు మంచి మనసున్న హీరోయిన్. అందుకే అందరూ ఆమెను ముందుగా స్వీటీ అని పిలుస్తుంటారు. అనుష్క గ్లామర్ పాత్రల కన్నా వైవిద్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ఎక్కువగా నటించింది.

అయితే చాలా కాలంగా ఈ అమ్మడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అనుష్క మళ్లీ సినిమాలలో నటించాలని ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఇటీవల ఈ అమ్మడు ఒక ప్రాజెక్ట్ ఓకే చేసింది. నవీన్ పొలిశెట్టి హీరోగా యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఓ తెలుగు సినిమాలో అనుష్క కీలక పాత్రలో నటిస్తోంది. అయితే తమ అభిమాన హీరోయిన్ మునుపటిలా వరుస సినిమాలలో నటించాలని ఆమె అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సెలబ్రెటీలతోపాటు సామాన్యులు కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే ప్రతి విషయాన్ని వారు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో షేర్ చేస్తూ ఉంటారు.

కానీ అనుష్క మాత్రం సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటుంది. చాలా ఆలస్యంగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన స్వీటీ కి ఇన్‌స్టా లో 5.6 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఇన్ స్టాలో ఆమె ఫాలో అయ్యే వారి సంఖ్య కేవలం 23. అయితే ఆమె ఫాలో అయ్యే వారిలో ఎక్కువమంది తెలుగువారే ఉన్నారు. ఇక మన టాలీవుడ్ హీరోలలో కేవలం ఇద్దరు హీరోలు మాత్రమే అమెకు స్పెషల్. అందుకని ఆ ఇద్దరు హీరోలను మాత్రమే ఫాలో అవుతోంది. ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు. ఒకరు బాహుబలి, మరొకరు బల్లాల దేవ. అయితే అనుష్క ఫాలో అయ్యే హీరోయిన్ల సంఖ్య ఎక్కువగానే ఉంది.