బేబి బంప్ ఫొటోల‌తో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్న అనుష్క శ‌ర్మ‌..

బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ.. చెప్పాలంటే ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ టైమ్ లోనే ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న నటిగా పేరు తెచ్చుకుంది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్ళి చేసుకుని అటు క్రికెట్ అభిమానుల్ని కూడా సొంతం చేసుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. అయితే ప్రస్తుతం అనుష్క నిండు గర్భిణి. మరి కొద్ది రోజుల్లో ఓ బేబికి జన్మనివ్వబోతోంది. అయితే ఈ స్టార్ హీరోయిన్ తన ప్రెగ్నెన్సీని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి ఎన్నో సార్లు తమ ఫోటోల్ని ఇంటర్నెట్ లో షేర్ చేశారు.

తన సోషల్ మీడియా అభిమానులకు తన బేబి బంప్స్ ఫోటోస్ అప్ లోడ్ చేస్తూ తెగ అలరిస్తోంది. లేటెస్ట్ గా వోగ్ అనే మ్యాగజైన్ కవర్ ఫోటో కోసం తన బేర్ బేబి బంప్ ఫోటోస్ కోసం కెమెరాకి ఫోజులిచ్చింది అనుష్క శర్మ. అయితే ప్రస్తుతం అనుష్క్ శర్మ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోస్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ.. ‘ఈ ఫోటో నా కోసం.. నా లైఫ్ కోసం’ అంటూ అనుష్క పోస్ట్ చేసింది. ఇంకా ఈ పేజ్ కవర్ పై న్యూ బిగినింగ్స్ ఆఫ్ అనుష్క శర్మ అని రాశారు.

డిఫరెంట్ లుక్స్ తో.. ట్రెండీగా, మోడ్రన్ మదర్ గా అద్దిరిపోయే ఫోజులిచ్చింది అనుష్క శర్మ. ముఖ్యంగా పొడవైన వైట్ కాలర్డ్ లూస్ ఓవర్ కోట్ లో ఉన్న అనుష్క లుక్ అద్భుతంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.