Anushka Sharma: ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కత్రినాకైఫ్ గురించి చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలోనే ఆమె ధరించిన డ్రెస్ అలాగే, ఆమె నిశ్చితార్థపు ఉంగరం గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఇలా కత్రినా కైఫ్ తన పెళ్లిలో తన నగలు దుస్తుల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసిందని బీ టౌన్ లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే కత్రినా కైఫ్ తన వివాహం జరిగిన విధంగానే ఎంతో మంది ముద్దుగుమ్మలు ఈ స్థాయిలో వారి వివాహ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ సూపర్ జోడి ఒకరైన విరుష్క దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుని ఢిల్లీలో రిసెప్షన్ ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించారు. ఇక వీరి వివాహ రిసెప్షన్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరైన సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా అనుష్క శర్మ ధరించిన వివాహ రిసెప్షన్ చీర మరోసారి వార్తల్లోకి వచ్చి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ రిసెప్షన్ లో అనుష్క శర్మ ధరించిన బనారస్ జరీ చీర స్వచ్ఛమైన బంగారంతో తయారుచేసినదని, ఈ చీరలు తయారు చేయడం కోసం సుమారు 6 నెలల సమయం పట్టిందనే వార్తలు వినిపించాయి.
వివాహ రిసెప్షన్ కి గ్రాండ్ గా తయారుచేసిన ఈ గోల్డ్ బనారస్ చీర సుమారు ఐదు లక్షల వరకు ధర పలికినట్లు సమాచారం. ఈ చీరను బనారసీ చీరల బిజినెస్ మ్యాన్ మక్బూల్ హసన్ తెలిపారు. గతంలో ఇలా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయి దంపతులకు ఈ విధమైనటువంటి వరస చీరను తయారు చేశారు. ఈ విధమైనటువంటి చీరను ‘సోనా రూపా బూటా’ బనారసీ చీర అని పిలుస్తారు. ఈ డిజైనర్ శారీని ఒక్కసారి మాత్రమే నేస్తారట.