Anushka Sharma: టీమ్ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ సౌతాఫ్రికా టూర్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే విరాట్ సౌతాఫ్రికాలో ఉండడంతో అనుష్క శర్మ కూడా తన కూతురుతో కలిసి అక్కడే ఉంది. ఈ క్రమంలోనే అనుష్క సోషల్ మీడియా వేదికగా మ్యాచ్ లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.
ఇకపోతే వీరిద్దరి గారాలపట్టి వామిక జనవరి 11వ తేదీ మొదటి పుట్టిన రోజును జరుపుకోవడంతో విరాట్ దంపతులు సౌతాఫ్రికాలో టీం ఇండియా సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా పుట్టినరోజును జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అనుష్క శర్మ విరాట్ కోహ్లీ చేతిలో మందు గ్లాస్ లతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా అనుష్క శర్మ మాట్లాడుతూ… సూర్యుడు ఎంతో ప్రకాశవంతంగా లేలేత అందగాడిగా మారిపోయాడు.. టేబుల్ మొత్తం నిండిపోయింది. మా పాప కూడా అలాగే మారిపోయింది అంటూ చెప్పుకొచ్చారు.
అదే విధంగా తన కూతురిని ఎత్తుకొని ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ అనుష్క శర్మ ఎంతో స్వచ్ఛంగా నవ్వుతూ నా పాప అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అలాగే తన కూతురు పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అనుష్క శర్మ కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే వామిక పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫొటో కూడా సోషల్ మీడియాలో రాకుండా ఈ జంట జాగ్రత్తపడ్డారు.అనుష్క శర్మ విషయానికొస్తే పాపకు జన్మనిచ్చిన తర్వాత పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరమైన తన కూతురితో పూర్తి సమయాన్ని గడపడానికి ఇష్టపడుతోంది.