Prabhas-Anushka: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి మనందరికీ తెలిసిందే. అనుష్క ప్రస్తుతం కేవలం సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు ఒక సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది సమంత. క్రిష్ దశకత్వంలో ఘాటి అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా కోసం అనుష్క అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను 2025 ఏప్రిల్ 18న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు మూవీ మేకర్స్.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాలో అనుష్క విభిన్నమైన లుక్ లో కనిపించబోతుంది. ఇటీవల విడుదలైన గ్లిమ్స్ లో అనుష్క లుక్ తో పాటు, ఆమె పాత్రను కూడా రివీల్ చేశారు. అత్యంత క్రూరంగా అనుష్క హత్య చేసిన షాట్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి. డైరెక్టర్ క్రిష్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాను చేస్తూ ఆలస్యం అవుతున్న కారణంగా మధ్యలోనే వదిలేసి అనుష్కతో ఘాటి సినిమాను మొదలు పెట్టారు. షూటింగ్ పూర్తి అయిన ఘాటి సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉండటంతో విడుదల వాయిదా వేస్తూ వస్తున్నారు. సినిమాను ఏప్రిల్ 18న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. అయితే ఏప్రిల్ 10న ప్రభాస్ రాజా సాబ్ చిత్రం రానున్న సంగతి తెలిసిందే.
మారుతి ఆ మూవీని నెక్ట్స్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడని టీజీ విశ్వ ప్రసాద్ సందు దొరికినప్పుడల్లా హైక్ ఎక్కిస్తూనే ఉన్నాడు. మరి ప్రభాస్ రాజా సాబ్ సినిమా దాటికి అనుష్క మూవీ నిలబడుతుందా? ఈ విషయంలో ప్రభాస్ కి అనుష్క ఎదురు వెళుతోందా? ఎదురు వెళ్లి నిలబడగలదా? అన్న అనుమానాలు ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఘాటీ సినిమా బాగుంటే పర్లేదు కానీ కొంచెం అటు ఇటుగా ఉన్న ఈ సినిమా దరిదాపుల్లో కూడా కనిపించదు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే డార్లింగ్ సినిమా విడుదల అవుతుంది అంటే చిన్న చిన్న సినిమాలు ఏవి కూడా పోటీకి రావు. దానికి తోడు ప్రభాస్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా బాగున్న బాగా లేకపోయినా ఖచ్చితంగా రెండు వారాలపాటు సక్సెస్ఫుల్గా ప్రచారం అవుతుంది అన్నంలో ఎలాంటి సందేహం లేదు. అందులోనూ రాజా సాబ్ సినిమా ఇంకా మొదలు కాకముందే ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. మరి ఆ అంచనాలన్నింటినీ తట్టుకొని అనుష్క సినిమా నిలబడుతుందో లేదో చూడాలి మరి.