ప్రేమలో ఉన్న విషయాన్ని బయట పెడుతూ షాకింగ్ కామెంట్స్ చేసిన అనుపమ!

టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమె నిఖిల్ సరసన పలు సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.సోషల్ మీడియా వేదికగా తన ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు అభిమానులను పెంచుకుంటూనే ఉన్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ పరమేశ్వరన్ ప్రేమ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.తాను ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే తప్పకుండా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని, లవ్ మ్యారేజ్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఈ సందర్భంగా అనుపమ వెల్లడించారు.ఈ విధంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలను చూస్తే తనకు ఎంతో ముచ్చటగా ఉంటుందని అయితే ఈ విషయం తన కుటుంబ సభ్యులకు కూడా తెలుసని వెల్లడించారు.

ఇక ప్రస్తుతం తాను ఎవరితో అయినా రిలేషన్ లో ఉన్నారా అనే విషయం గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుతం తాను రిలేషన్ లో ఉన్నానని అయితే తన రిలేషన్ గురించి తనకే క్లారిటీ లేదని తెలిపారు.తన ప్రేమను బయటపెడితే అవతలి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో తెలియక కేవలం వన్ సైడ్ లవ్ మాత్రమే అని చెప్పగలను అంటూ ప్రేమ గురించి అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.అయితే ఈమె రిలేషన్ లో ఉన్నానని వన్ సైడ్ లవ్ అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ కావడంతో ఈమె ఎవరిని లవ్ చేస్తుంది అంటూ పెద్ద ఎత్తున అభిమానులు, నెటిజన్లు ఆరా తీస్తున్నారు.