Anupama : అనుపమని కూడా ఆ దోమ కుట్టిందట.!

Anupama :  ‘అఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. అంతకు ముందే ‘ప్రేమమ్’ సినిమాతో పాపులర్ అయ్యిందీ మలయాళ కుట్టి. స్టార్ హీరోయిన్ అనలేం కానీ, మంచి టాలెంట్ వున్న నటి.
కానీ, టైమ్ కలిసి రావడం లేదు. అరకొరా అవకాశాలతోనే సరిపెట్టుకోవల్సి వస్తోంది అనుపమకి. రీసెంట్‌గా ‘రౌడీ బాయ్స్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది అనుపమా పరమేశ్వరన్.
ఈ సినిమాలో కాస్త హద్దులు దాటి గ్లామర్ ప్రదర్శించిందనే చెప్పాలి. ఎప్పుడూ లేని విధంగా అలా అలా వేడి వేడి లిప్‌లాకులు కూడా లాగించేసిందీ ముద్దుగుమ్మ. అయితే, అనుపమ పరమేశ్వరన్‌కి ఓ డ్రీమ్ వుందట.
ఆ డ్రీమ్ ఫుల్ ఫిల్ చేసుకునే దిశగా ప్రయత్నాలు మొదలెట్టిందట. ఇంతకీ ఏంటా డ్రీమ్.?
యాక్షన్ గాళ్ ఇమేజ్ కోసం అనుపమ ట్రై చేస్తోందట. ఇప్పటికే కరాటే, టైక్వాండో వంటి పోరాట విద్యల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోందట. ఓ యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలో నటించాలని వుందని అంటోంది. అది సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా తనకు ఓకే అంటోంది.
‘ఫ్యామిలీ మేన్’ సినిమాలో సమంత పోషించిన పాత్ర తరహాలో నటించాలనుకుంటోందట అనుపమ పరమేశ్వరన్. ఆ రేంజ్ యాక్టింగ్ స్కిల్స్ చూపించగల సత్తా వున్నదే అనుపమ. చూడాలి మరి, అలాంటి ఆఫర్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరు.. ఇస్తారో అనుపమకి.