Pan India Entry : బిగ్ అప్డేట్ : పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్న మరో యంగ్ హీరో..!

Pan India Entry : ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమా అంటే గుర్తొస్తుంది మన సౌత్ ఇండియన్ సినిమాలనే చెప్పాలి. అందులోని మన టాలీవుడ్ నుంచి దాదాపు 70 శాతం సినిమాలు పెద్ద హీరోల సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్లోనే రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ పాన్ ఇండియా రిలీజ్ లో ఎక్కువగా టార్గెట్ చేసేది హిందీ మార్కెట్ లోనే అని చెప్పాలి.

వీరినే టార్గెట్ చేస్తూ మన టాలీవుడ్ స్టార్స్ తమ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ లిస్ట్ లో మన టాలీవుడ్ బిగ్ స్టార్స్ తో పాటు కొందరు యంగ్ హీరోలు కూడా ఉన్నారు. వారిలో ఆల్రెడీ విజయ్ దేవరకొండ “లైగర్” తో రెడీ అవుతుండగా నితిన్ కూడా తన “పవర్ పేట” సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తున్నాడు.

ఇక బెల్లంకొండ శ్రీనివాస్ అయితే ఏకంగా డైరెక్ట్ బాలీవుడ్ సినిమానే చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా వీరితో పాటు ఇంకో యంగ్ హీరో రామ్ పోతినేని కూడా రెడీ అవుతున్నాడు. మాస్ దర్శకుడు ఎన్ లింగుసామి తో ప్లాన్ చేసిన పక్కా మాస్ మసాలా చిత్రం “ది వారియర్”.

తెలుగు మరియు తమిళ్ లో ప్లాన్ చేసిన ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. లేటెస్ట్ గా ఈ సినిమా హిందీ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీనితో రామ్ కూడా పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. మరి రామ్ ఎలాంటి వెల్కమ్ అందుకుంటాడో చూడాలి.