కమల్ భారీ సినిమాలో ఈ క్రేజీ యాక్టర్ ని సస్పెన్స్ గా దాచారు.!

kamal haasan : నటన అంటే మన ఇండియన్ సినిమా దగ్గర మొట్టమొదట గుర్తుకొచ్చే పేరు లోక నాయకుడు కమల్ హాసన్. నటన అంటే ప్రాణం పెట్టేసి నటుల్లో తాను ఫస్ట్ ఉంటారు. ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్లో ఎప్పుడో పెట్టిన తాను తాజాగా ఓ భారీ ఏక్షన్ డ్రామా లో నటించారు.

అయితే ఆ సినిమానే “విక్రమ్”. తమిళ స్టార్ దర్శకుడు “మాస్టర్” ఫేమ్ లోకేష్ కనగ రాజ్ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది. అయితే ఈ భారీ సినిమాలోకమల్ హాసన్ తో పాటుగా తమ నటనలో పొటెన్షియల్ తో ఆకట్టుకున్న మరో ఇద్దరు స్టార్ నటులు విజయ్ సేతుపతి అలాగే ఫహద్ ఫాజిల్ లు కీలక పత్రాలు చేసారు.

దీనితో జస్ట్ ఈ ముగ్గురు పేర్లతోనే ఈ సినిమాకి మంచి క్రేజ్ వచ్చేసింది. మరి ఈ సినిమాలో ఈ ముగ్గురు మాత్రమే కాకుండా ఇంకో విలక్షణమైన నటుడు కూడా ఉన్నట్టుగా ఇపుడు తెలుస్తుంది.

ఆ నటుడు మరెవరో కాదట అదే తమిళ ఇండస్ట్రీకి చెందిన అందులోని నటన అంటే ప్రాణం పెట్టె హీరో సూర్య అట.

తాను ఈ సినిమాలో ఒక కీలక పాత్రకి గాని క్యామియో లో కనిపిస్తాడట. ఇది తాజాగా బయటకి వచ్చిన వార్త. దీనితో ఈ క్రేజీ కాంబోలో సినిమా అంటే అందరిలో ఇప్పుడు మరింత ఆసక్తి నెలకొంది. మరి ఎలాంటి సీన్స్ లో తాను కనిపిస్తాడో అనేవి అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే కమల్ హాసన్ తన సినిమా నిర్మాణ సంస్థపై భారీ బడ్జెట్ తో నిర్మాణం అందించారు.