Pushpa Movie: మరో అరుదైన అవార్డును దక్కించుకున్న పుష్ప… ఖుషి అవుతున్న అభిమానులు!

Pushpa Movie: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన మూడవ చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలయి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉండగా ప్రమోషన్ కార్యక్రమాలకు ఏమాత్రం సమయం లేకుండా విడుదలైన ఈ సినిమా అన్ని భాషలలో అఖండమైన విజయాన్ని అందుకుని రికార్డులను సృష్టించింది. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని పాటలు డైలాగ్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా అత్యంత గౌరవప్రదమైన అవార్డును దక్కించుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే పుష్ప సినిమా దాదాసాహెబ్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్​ 2022 అవార్డుకు ఎంపికయింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా అధికారికంగా తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బన్నీ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇదివరకే అల్లు అర్జున్ సుకుమార్ దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్లో తెరకెక్కిన ఆర్య, ఆర్య 2 సినిమాలో కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. మొట్ట మొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో ఈ ముగ్గురి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించి 350 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ విధంగా పుష్ప పార్ట్ 1 ఇలాంటి రికార్డులను సృష్టించడంతో చిత్రబృందం పుష్ప పార్ట్-2 పైమరింత శ్రద్ధ వహిస్తూ ఈ సినిమాను శరవేగంగా తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు.