పరిపాలనా రాజధానిగా అవతరించబోయే విశాఖపట్టణం లో సోమవారం మరో ప్రమాదం చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖ పట్టణం విమానశ్రయం సమీపంలోని షిలా నగర్ సీ ఎఫ్ ఎస్ కంటైనర్ యార్డులో భారీగా అగ్ని ప్రమాదం చోటు సంభవించింది. హానికర రసాయనం అల్యుమినియం ప్లోరిటే క్యాచ్లు ద్వారా వ్యాపిస్తోన్న దట్టమైన పొగతో మంటలు ఎగసిపడుతు న్నాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటా హుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ ప్రమాదం లో ప్రాణ నష్టం చోటు చేసుకుందా? క్షతగాత్రులు ఉన్నారా? అసలు ప్రమాదం ఎలా జరిగింది? అన్న పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు.
సీఎఫ్ ఎస్ కంటైనర్స్ తెలుగు రాష్ర్టాలలోనే పెద్దది. అలాంటి కంటైనర్స్ లో ప్రమాదం అనే సరికి విశాఖ వాసులు మరోసారి ఉలిక్కి పడ్డారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిస్తే గానీ అసలేం జరిగింది! అన్నది తెలియదు. ఇక ఉక్కు నగరంలో ఇటీవల కాలంలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎల్ జీ పాలిమర్స్, హెచ్ పీ సీఎల్, సాయినార్ ఫార్మా సహా మరో రసాయనాల కంపెనీల్లో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. పలువురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదాల వెనుక ప్రతిపక్ష పార్టీ కుట్ర ఉందని అనుమానాలు వ్యక్తం చేసారు వైకాపా నాయకులు. ఈ ప్రమాదాలన్నింటిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయిస్తామని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సహా విశాఖ వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ తెలిపారు.
విశాఖ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బ తీసేందుకు ఆ పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని వైకాపా నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం నేతలు ఆ వ్యాఖ్యల్ని ఖండించారు. అదంతా ముగిసన తర్వాత టీడీపీ మరో కొత్త వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అదే తూర్పుగోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకూ సముద్ర గర్భంలో 1000 మీటర్ల అడుగు వరకూ 300 కిమీటర్ల మేర చీలిక ఏర్పడిందని దాని వల్ల భవిష్యత్ లో భూ కంపాలు, సునామీలు వస్తాయని అదే సామాజిక వర్గానికి చెందిన ఓ సైంటిస్ట్ ని పట్టుకుని రాజకీయం ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నానాన్ని వైకాపా భగ్నం చేసిన సంగతి తెలిసిందే.