బిగ్ హౌస్ నుంచి ఇంకో ఎలిమినేషన్. ఇది ముందే ఖరారైపోయింది. ముందే లీకైపోయింది కూడా. శ్వేత వర్మ, ఈ సీజన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరు. కానీ, ఆమె కూడా ఎలిమినేట్ అయిపోవడాన్ని ఎలా చూడాలి.? అసలు బిగ్ బాస్ లెక్కలు వేరు.
ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసే ఫుటేజీ ఎవరు ఇస్తే, వాళ్ళకి లైఫ్ ఎక్కువ వుంటుంది హౌస్‌లో.. అన్నది ఓ అభిప్రాయం మాత్రమే. ఆ లెక్కన షన్నూని ఇప్పటికే పంపించెయ్యాలి. కానీ, అలా జరగడంలేదు. దానికి ఇంకో ఈక్వేషన్ వుంటుంది.
శ్వేత వర్మ ఎందుకు ఎలిమినేట్ అయ్యింది.? ఇంకెందుకు, యాంకర్ రవి చెప్పినట్లు చేసింది గనుక.. చివరికి అది తప్పు అని తేలింది గనుక. అలాగైతే, గతంలో ప్రియ ఎలిమినేట్ అయిపోవాలి. ప్రియని అంతలా పాంపర్ చేసి, లహరి మీదకు ఉసిగొల్పాడు రవి. ఆ వ్యవహారంలో లహరి బలిపశువు అయిపోయింది.
దాదాపుగా ప్రతి వారం ఎలిమినేట్ అవుతున్నవారంతా ఏదో ఒక రకంగా రవితో కనెక్ట్ అయినవారే. ఇప్పుడు శ్వేతా వర్మ.. అంతే తేడా. అన్నట్టు, లోబో కూడా రవి వల్లనే పాంపర్ అయ్యాడు.. సీక్రెట్ రూంలోకి వెళ్ళాడు. ఇదంతా చూస్తోంటే, ఈ సీజన్ పూర్తయ్యే సమయానికి యాంకర్ రవి బాధితుల సంఘం ఏర్పడుతుందేమో.
జస్ట్ జోకింగ్.. ఇదంతా బిగ్ బాస్ ఆడే డ్రామా.. పాపం రవి ఈ గేమ్‌లో ఓ పాత్రధారి.. అయినా, బలైపోతున్నాడు నెటిజన్ల ట్రోలింగ్ దెబ్బకి.