గత సంవత్సరం ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని బొల్లినేని శ్రీనివాస గాంధీ అనే వ్యక్తి మీద కేసు నమోదు అయిన విషయం గుర్తుందా మీకు. ఆయన ఈడీ విభాగంలో పని చేసేవాడు. అప్పుడు ఈడీలో పనిచేసినప్పుడు ఆయన తనకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని… టీడీపీ ప్రెసిడెంట్ చంద్రబాబు ఆదేశాలతో చంద్రబాబు టార్గెట్ చేసిన వాళ్లపై ఈయన తన ప్రతాపాన్ని చూపినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎప్పటి నుంచో చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్న బొల్లినేని.. 2004 నుంచి 2017 వరకు ఆయన ఈడీ డిపార్ట్ మెంట్ లోనే విధులు నిర్వర్తించాడు. ఆ సమయంలో ఆయనపై ఎన్నో ఆరోపణలు వచ్చినా వెనుక చంద్రబాబు ఉన్నారు కాబట్టి నడిచింది. కానీ.. ఇప్పుడు
మరోసారి బొల్లినేని రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ లో పన్ను ఎగవేత నిరోధక విభాగంలో బయటపడిన అవినీతిలో బొల్లినేని కూడా బుక్కయ్యాడు.ఇన్ పుట్ క్రెడిట్ మంజూరుకు సంబంధించి… అధికారులు ఒక కంపెనీ డైరెక్టర్ల నుంచి 5 కోట్ల రూపాయలను డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఆ అధికారులు సుధారాణి, బొల్లినేని శ్రీనివాస గాంధీ మరో కంపెనీ డైరెక్టర్ సత్య శ్రీధర్ రెడ్డిలపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఓ కంపెనీకి సంబంధించి దాడులు చేస్తున్న సమయంలో ఈ 5 కోట్ల వ్యవహారం కూడా బయటికి పొక్కింది. దీంతో సీబీఐ అధికారులు… జీఎస్టీ కమిషనరేట్ లో ఉన్న అవినీతి అధికారులను అదుపులోకి తీసుకున్నారు.
జీఎస్టీ అధికారులతో కలిసి… జీఎస్టీ ఆన్ ఫుట్ క్రెడిట్ ట్యాక్స్ కు సంబంధించి దర్యాప్తు చేసిన బొల్లినేని బృందం కేసును నిందితులను అనుకూలంగా మార్చడం కోసం ఏకంగా… 5 కోట్ల రూపాయలను లంచంగా అడిగారని సీబీఐకి తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న సీబీఐ.. బొల్లినేని బృందాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇప్పటికే బొల్లినేనిపై అనేక కేసులు ఉన్నాయి. వాటితో పాటు తాజాగా ఈ కేసు కూడా నమోదు అయింది.