అత్యవసర బ్రేకింగ్ : టీడీపీ నుంచి మరొక నలుగురు ఎమ్మెల్యే లు జంప్ .. !??

టిడిపి ఇప్పుడు నడుస్తున్నంత గడ్డు కాలంలో గతంలో ఎప్పుడు లేదు భవిష్యత్తులో కూడా రాకపోవచ్చు. అసలే 2019 ఎన్నికల్లో వచ్చినవే 23 సీట్స్ , అందులో ఇప్పటికే చాలామంది వైసీపీ బాట పట్టారు. కనీసం ఇప్పుడు ఆంధ్రపదేశ్ లో టీడీపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతుంది , ఇంకొన్నాళ్ళు ఉంటే అది కూడా పోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వల్లభనేని వంశీ టీడీపీ నుండి గన్నవరం నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు టీడీపీ రెబల్ అయిన విషయం తెలిసిందే. అయితే నిన్న టీడీపీని వీడి సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో విశాఖపట్నం దక్షిణ నియోజక వర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వైసీపీలో చేరారు.
Nara Chandra Babu Naidu
మరో నలుగురు టీడీపీని విడనున్నారా!

వైసీపీ చేరిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పోతూ పోతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బాంబ్ పేల్చి వెళ్లారు. టీడీపీలో ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో మరో నలుగురు వైసీపీలో రావడానికి సిద్ధంగా ఉన్నారని చాలా పక్కాగా చెప్పారు. ఈ మాటలు విన్న చంద్రబాబు నాయుడు దీర్ఘ ఆలోచనలో పడ్డారు. రాష్ట్రంలో ఇప్పుడు టీడీపీ ఉన్న పరిస్థితి బట్టి చూస్తే గణేష్ చేసిన వ్యాఖ్యలు నిజం అనుకునే విధంగా ఉన్నాయి. ఇప్పుడు వైసీపీలో వెళ్లనున్న ఆ నాయకుల గురించి చంద్రబాబు నాయుడు ఆరా తీసే పనిలో పడ్డాడని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ప్రతిపక్ష హోదాను కూడా టీడీపీ కోల్పోనుందా !

నిబంధనల ప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండాలంటే కనీసం 18 ఎమ్మెల్యే సీట్స్ ఉండాలి. అయితే ఇప్పటికే కొంతమంది వైసీపీలోకి వెళ్లగా, ఇంకొంతమంది వైసీపీలో వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ రానున్న రోజుల్లో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 18 కంటే తక్కువగా ఉంటే చంద్రబాబు నాయుడు ప్రతి పక్ష నాయకుడి హోదాను కోల్పోయి మాములు ఎమ్మెల్యేగా మిగిలి పోతాడు. మూడు సీఎంగా విధులు నిర్వహించిన చంద్రబాబు నాయుడు రానున్న రోజుల్లో ఘోర అవమానాన్ని ఎదుర్కోబోతున్నారని వైసీపీ నాయకులు, రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.