Susanth Singh: సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు?

Susanth Singh: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రేయసి అంకిత మరికొన్ని గంటల్లో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. అంకిత లోఖండే, విక్కీ డిజైన్ డిసెంబర్ 14న ఒకటి కాబోతున్నారు. గత మూడేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట మరి కొన్ని గంటలలోనే మూడుముళ్ల బంధంతో తమ వైవాహిక జీవితాన్ని మొదలు పెట్టనున్నారు. డిసెంబర్ 14న ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ వీరి పెళ్ళికి వేదిక కానుంది. ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించిన వేడుకలు మొదలయ్యాయి.

ఒక వైపు కరోనా, మరొకవైపు ఒమిక్రాన్ వైరస్ ల కారణంగా ఇరువురి కుటుంబ సభ్యులు,బంధువులు, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లి తరువాత డిసెంబర్ 14న గ్రాండ్ గా రిసెప్షన్ పార్టీ జరగనుందని సమాచారం. రేపు వివాహం కావడంతో అంకిత మెహందీ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది.ఈ మెహందీ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈమె 2005 లో తన కలను సాకారం చేసుకోవడానికి ముంబైకి వచ్చింది. అలా తన టాలెంట్ నిరూపించుకునేందుకు టాలెంట్ హంట్ అనే రియాల్టీ షోలో పాల్గొంది. అనంతరం పవిత్ర రిస్టా అనే టీవీ సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే హీరో సుశాంత్ సింగ్ తో డేటింగ్ చేస్తున్నట్లు 2019లో ఆమె ప్రకటించింది. ఆ తర్వాత అతనితో రిలేషన్షిప్ కొనసాగించింది. బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక సినిమాతో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తన ప్రియుడు సుశాంత్ సింగ్ బ్రేకప్ తర్వాత బాలీవుడ్ నటుడు విక్కీ జైన్ తో ప్రేమలో పడింది. గత మూడేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఇరువురి పెద్దల అనుమతితో రేపు ఉదయం డిసెంబర్ 14 న పెద్దల అనుమతితో ఒకటి కాబోతున్నారు.