పులి, నేను శైలజ వంటి సినిమాల్లో సైడ్ డాన్సర్ గా కనిపించి 2017 లో మా అబ్బాయి సినిమాలో శ్రీ విష్ణు తో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన నటి చిత్రా శుక్ల. తర్వాత రంగులరాట్నం, సిల్లీ ఫెలోస్, తెల్లవారితే గురువారం ఉనికి హంట్ వంటి చిత్రాలలో నటించి మంచి పేరుని సంపాదించుకుంది. ఇటీవల అహోవిక్రమార్క అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
మధ్యప్రదేశ్ కి చెందిన ఈ నటి 2014లో చల్ బాగ్ అనే హిందీ మూవీ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అనతి కాలంలోనే తెలుగులో కూడా సినిమాలు చేసి మంచి పేరు సంపాదించుకుంది. త్వరలోనే తమిళంలో కూడా నా నా అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ నటి. అయితే ఈమె 2023 డిసెంబర్ లో వైభవ్ ఉపాధ్యాయ అనే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ని పెళ్లి చేసుకుంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పోలీస్ అధికారిగా వైభవ్ పనిచేస్తున్నారు.
బయోటెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసిన చిత్రకు అతను కాలేజీ రోజుల్లోనే పరిచయం. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ నటి తన మొదటి వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె తన పెళ్లి ఫోటోలు, రిసెప్షన్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమెకి శుభాకాంక్షలు చెప్తూ అనేకమంది నెటిజన్స్, సినీ సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఈ మధ్యనే ఈమె తల్లిని కాబోతున్నాను అంటూ తన సీమంతం ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పెట్టి అభిమానులతో తన ఆనందాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆమె ఒక మగ బిడ్డకి జన్మనిచ్చిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే తన పెళ్లి ముహూర్తం సమయానికే తనకి కొడుకు కూడా పుట్టటం ఆనందాన్నిచ్చిందంటూ మీడియాలో షేర్ చేసుకుంది ఈ నటి.