ఇంటివాడైన రణ్‌దీప్‌ హుడా…

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రణ్‌దీప్‌ హుడా ఓ ఇంటివాడయ్యాడు. మోడల్‌, నటి లిన్‌ లైస్రామ్‌ను ఆయన ప్రేమ వివాహం చేసుకున్నాడు. మణిపూర్‌ రాజధాని ఇంపాల్‌ లోని ఓ దేవాలయంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. మణిపూర్‌ సంప్రదాయం ప్రకారం ఈ జంట ఒక్కటైంది.

ఈ మేరకు పెళ్లి విషయాన్ని తెలియజేస్తూ సోషల్‌ విూడియా ద్వారా రణ్‌దీప్‌ హుడా ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు, పలువురు ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లిన్‌ లైస్రామ్‌తో రణ్‌దీప్‌ గత కొన్ని రోజులుగా డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాము వివాహం చేసుకోబోతున్నాం అంటూ ఇటీవలే సోషల్‌ విూడియాలో ప్రకటన చేశారు. ’మహాభారతంలో మణిపుర్‌ యువరాణి చిత్రాంగదను అర్జునుడు ఎక్కడ వివాహం చేసుకున్నాడో.. అక్కడే మేము ఒక్కటి కాబోతున్నాం. ఈ నెల 29న ఇంపాల్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితులు సమక్షంలో మా (రణ్‌దీప్‌ హుడా, లిన్‌ లైస్రామ్‌) పెళ్లి జరగనుంది.

త్వరలోనే ముంబయిలో రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నాం. మా ప్రయాణానికి విూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం’ అని రణ్‌దీప్‌ హుడా ఇన్‌స్టాలో రాసుకోచ్చాడు. 2001లో రిలీజైన మన్‌సూన్‌ వెడ్డింగ్‌ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు రణ్‌దీప్‌ హుడా. ఇక ఆయన నటించిన చిత్రాలలో ’జిస్మ్‌ 2’, ’బాంబే టాకీస్‌’, ’కిక్‌’, ’హైవే’ సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక ప్రస్తుతం బీజేపీ ప్రాపగాండా మూవీ ’స్వతంత్ర వీర్‌? సావర్కర్‌’ చిత్రంలో నటిస్తున్నాడు.