సక్సెస్ ఫుల్ డైర‌క్ట‌ర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా `క‌ర‌ణ్ అర్జున్‌` ట్రైలర్ విడుదల

Karan Arjun

రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్ ప‌తాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా న‌టించిన  చిత్రం `క‌ర‌ణ్ అర్జున్‌`. ఈ  చిత్రానికి మోహ‌న్ శ్రీవ‌త్స ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డా.సోమేశ్వ‌ర‌రావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల, సురేష్ ,రామకృష్ణ ,క్రాంతి కిరణ్ నిర్మాత‌లు. ర‌వి మేక‌ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌.

ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈ రోజు స‌క్సెస్ ఫుల్  డైర‌క్ట‌ర్  అనిల్ రావిపూడి లాంచ్ చేశారు.
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు  అనిల్ రావిపూడి మాట్లాడుతూ..“ క‌ర‌ణ్ అర్జున్‌` ట్రైల‌ర్ చాలా బావుంది. విజువ‌ల్స్ చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి.  ఒక యంగ్ టీమ్ ఎంతో రిస్క్ చేసి  పాకిస్థాన్ బార్డ‌ర్ లో షూటింగ్ చేశారు. ట్రైల‌ర్ లాగే సినిమా కూడా బావుంటుంద‌ని ఆశిస్తూ… టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్ తెలియ‌జేస్తున్నా“ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు మోహ‌న్ శ్రీవ‌త్స మాట్లాడుతూ…“ఎఫ్ 3 ప్ర‌మోష‌న్స్ లో బిజీ గా ఉన్నా కూడా మాకు టైమ్ ఇచ్చి మా క‌ర‌ణ్ అర్జున్ మూవీ ట్రైల‌ర్ లాంచ్ చేసిన అనిల్ రావిపూడి గారికి  ధ‌న్య‌వాదాలు. ట్రైల‌ర్ లో విజువ‌ల్స్, లొకేష‌న్స్ బావున్నాయంటూ  అనిల్ రావిపూడి గారు ప్ర‌త్యేకంగా చెప్ప‌డంతో పాటు మా టీమ్ అంద‌రినీ  మెచ్చుకోవ‌డం మాకెంతో ఉత్సాహాన్నిచ్చింది.  మూడు పాత్ర‌ల‌తో రోడ్ థ్రిల్ల‌ర్ గా ఈ చిత్రాన్నితెర‌కెక్కించాం. పాకిస్థాన్ బార్డ‌ర్ లో ఎంతో రిస్క్ చేసి షూటింగ్ చేశాం. ప్ర‌తి స‌న్నివేశం ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఉంటూ  థియేట‌ర్ లో ఆడియ‌న్స్ ని ఎంట‌ర్ టైన్ చేస్తుంది. కంటెంట్ ని న‌మ్ముకుని చేసిన సినిమా ఇది“ అన్నారు.

నిర్మాత‌ల్లో ఒక‌రైన బాల‌కృష్ణ ఆకుల మాట్లాడుతూ…“అనిల్ రావిపూడి గారు మా సినిమా ట్రైల‌ర్ లాంచ్ చేయ‌డం ఎంతో సంతోషంగా ఉంది. ట్రైల‌ర్ అంద‌రికీ న‌చ్చుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. త్వ‌ర‌లో సినిమా విడుద‌ల తేదీ ప్ర‌కటిస్తాం“ అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ ర‌వి మేక‌ల మాట్లాడుతూ….“మా సినిమా ఫ‌స్ట్ లుక్ డైర‌క్ట‌ర్ ప‌రశురామ్ గారి చేత‌ల మీదుగా లాంచ్ చేశాం. దానికి మంచి పేరొచ్చింది. ట్రైల‌ర్ అనిల్ రావిపూడి గారు లాంచ్ చేసి మా టీమ్ అంద‌రికీ బ్లెస్సింగ్స్ అందించారు. ట్రైల‌ర్ చూస్తూ ఎగ్జ‌యిట్ అవ్వ‌డ‌మే కాకుండా చాలా బావుందంటూ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు“ అన్నారు.