బాలయ్యతో సినిమాపై ఇంట్రెస్టింగ్ లీడ్ ఇచ్చిన దర్శకుడు అనీల్ రావిపూడి.!

ఇప్పుడు నందమూరి నరసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపిచంద్ మలినేని తో ఒక భారీ ఏక్షన్ డ్రామా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమాకి ముందు “అఖండ” సినిమా చేసి భారీ విజయం అందుకోవడంతో ఇక నెక్స్ట్ సినిమాపై అనేక అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత కూడా బాలయ్య మరిన్ని ఆసక్తికరమైన సినిమాలు చేస్తుండగా..

వాటిలో నెక్స్ట్ హిట్ దర్శకుడు అనీల్ రావిపూడి తో సినిమా కూడా ఉంది. అయితే ఈ సినిమా కోసం కూడా నందమూరి అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. అయితే మరి లేటెస్ట్ గా తన ఎఫ్ 3 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు తాను చేసాడు. నేను ఈ సినిమా పట్ల చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నానని అయితే ఈ సినిమా లో కూడా కామెడీ ఉంటుంది కానీ ఎఫ్ 2 రేంజ్ లో ఉండదు.

అయితే బాలయ్య గారి రోల్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఆయన పాత్ర చాలా పరిపక్వత చెంది ఉండేలా కనిపిస్తుంది అని ఇంట్రెస్టింగ్ లీడ్ లను తాను అందించాడు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాల్సిందే.