AP: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఎన్నికలకు ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. సూపర్ సిక్స్ హామీలలో భాగంగా తల్లికి వందనం పథకంలో ప్రతి విద్యార్థికి 15000 రూపాయలు చొప్పున ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చెల్లిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అయితే ఒక విద్యా సంవత్సరం పూర్తి అయిన ఇప్పటివరకు తల్లికి వందనం పథకం అమలు చేయలేదు. ఇక ఈ విద్యా సంవత్సరం మొదట్లోనే తల్లికి వందనం పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
జూన్ 12వ తేదీ చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించారు అయితే ఈ ఏడాదిలో ఒకటో తరగతికి అలాగే ఇంటర్లో చేరే పిల్లలు ఉన్న నేపథ్యంలో ఈ నగదును జూలై 5వ తేదీ జమ చేయబోతున్నట్లు తెలుస్తోంది.అయితే ఇంట్లో ఎవరైనా ఫీజు రీయింబర్సమెంట్ పొందితే తల్లికి వందనం ఇవ్వరని సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్కాలర్ షిప్ పొందుతున్న వాళ్ళు సైతం ఈ పథకానికి అనర్హులు అని సమాచారం. అయితే గతంలో అమ్మబడి పథకం ద్వారా చదువుకుంటున్న ఒక బిడ్డకు ఈ పథకాన్ని అమలు చేశారు అయితే అప్పట్లో ఈ నిబంధనలు ఉండేది కాదని చెప్పాలి.
ఇదే సమయంలో రేషన్ కార్డు లేకపోయినా మున్సిపల్ పరిధిలో 1000 చదరపు అడుగుల స్థలం ఉన్నా, కారు ఉన్నా కూడా ఈ పథకానికి అర్హత పొందలేరని తెలుస్తోంది. విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటితే కూడా ఈ పథకానికి అర్హత లేనట్టేనని తెలుస్తోంది. మాగాని 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాలు ఉన్నా ఈ పథకానికి అర్హత లేనట్టేనని సమాచారం. ఇక ఈ పథకానికి అర్హులైన వారి జాబితాను సచివాలయాలకు అందజేస్తారని, అక్కడ ఎవరిపైనైనా ఫిర్యాదులు వస్తే ఈ పథకానికి అనర్హులని వెంటనే వారికి కూడా ఈ పథకం రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.