Sreemukhi: స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకుని, బిగ్ బాస్ పుణ్యమా అని ఆ ఫాలోయింగ్ ని మరింత పెంచుకుని, వరుస ఈవెంట్ లతో, రియాలిటీ షోలతో కెరీర్ లో దూసుకెళ్తూ అప్పుడప్పుడు సినిమాల్లో చేస్తూ తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది యాంకర్ శ్రీముఖి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి, ప్రస్తుతం తన పెళ్లి గురించి, ప్రేమ పై ఉన్న తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
బుల్లితెరపై రాములమ్మగా పేరు సంపాదించుకున్న శ్రీముఖి, ఒకరిని ప్రేమించి మోసపోయానని, భవిష్యత్తులో కూడా తాను ప్రేమ పెళ్లి చేసుకుంటానని బిగ్ బాస్ లో ఉన్నప్పుడు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఇంతకీ ప్రేమ మరియు పెళ్లి అనే విషయాలు శ్రీముఖి లైఫ్ లోకి ఎందుకు వచ్చాయి అనేదాని గురించి చెప్పాలంటే ఆమె తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ నిదర్శనంగా నిలుస్తుంది. ఇటీవల ప్రేమికుల దినోత్సవం సందర్భంగా శ్రీముఖి తన ఫోటోను షేర్ చేస్తూ ఓ ఆసక్తికర పోస్టును పెట్టింది. ఫిబ్రవరి 14 2022… ఈరోజు గుర్తుపెట్టుకోండి. ది బెస్ట్ వాలెంటైన్స్ ఎవర్ అంటూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ లో హాట్ సింబల్స్, లవ్ సింబల్స్ తో కూడిన ఎమోజీలను కూడా యాడ్ చేసింది. అంతేకాకుండా ఆమె షేర్ చేసిన ఫోటోలో శ్రీముఖి ఫ్లవర్ బొకే పట్టుకొని ఇచ్చిన ఫోజుని బట్టి చూస్తే ఆమె నిజంగా ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. కానీ తాను ఓకే చెప్పిన ఆ వ్యక్తి గురించి వివరాలపై మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వలేదు.
వీటన్నిటినీ గమనిస్తే శ్రీముఖి త్వరలోనే ప్రేమ లేదా పెళ్లి వార్తలపై తొందర్లోనే క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు నెటిజన్లు. ఆమె సన్నిహితులు కూడా ఈ విషయంపై అనధికారంగా ధ్రువీకరించినా ఈ ఫోటోని చూస్తే మాత్రం ఆమె తొందర్లోనే ఏదో ఒక శుభవార్తను వెల్లడిస్తారని పలువురు ఆకాంక్షిస్తున్నారు. ఈ వార్తే నిజమైతే వచ్చే వాలెంటైన్స్ డేకి ఆమె జంటగా కనిపించే అవకాశం ఉంది.