AP: నటుడు పోసాని అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్…. ఆడలేక మద్దెలు అడ్డు అంటూ!

AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా వైసిపి నేతలను టార్గెట్ చేస్తూ వారిని అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది కీలక నేతలను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు అయితే నిన్న సాయంత్రం నటుడు పోసాని కృష్ణమురళిని కూడా పోలీసులు అరెస్టు చేశారు ఆయన వైసీపీకి రాజీనామా చేయటమే కాకుండా రాజకీయాలకు కూడా దూరంగా ఉంటానని చెబుతూ ఇటీవల రాజీనామాను ప్రకటించారు.

ఇలా ఆయన తన రాజీనామాను తెలియజేసిన గతంలో చంద్రబాబు లోకేష్ పవన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ ఆయనపై కేసులు నమోదు చేసి తనని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇక ఈ విషయాన్ని ఎంతో మంది వైసిపి నాయకులు తప్పు పడుతున్నారు ఇక జగన్మోహన్ రెడ్డి సైతం ఈ విషయంపై పోసాని భార్యకు ఫోన్ చేసి మాట్లాడటమే కాకుండా ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారట. ఇప్పటికే పోసాని కోసం వైసీపీ లాయర్లందరూ రంగంలోకి దిగారని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా పోసాని అరెస్టుపై యాంకర్ శ్యామల స్పందించారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా పోసానిని అరెస్టు చేసినటువంటి నోటీసును కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫైర్ అయ్యారు..సమయం లేదు సందర్బం అసలే లేదు… రేపటి డేట్‌తో ఇవ్వాళా అరెస్ట్ అనే సోయి అసలే లేదు… ఆడలేక మద్దెలు అడ్డు అన్నట్టు హామీలు అమలు చెయ్యడం చేతగాని పెద్ద మనుషులు అక్రమ అరెస్టులతో కక్ష్యపూరిత రాజకీయాలకు తెరలేపారు… శివరాత్రి పూట ఇంటిపై దాడి చేసి పోసాని కృష్ణ మురళి అక్రమ అరెస్టు కూటమి ప్రభుత్వం అరాచకానికి నిలువెత్తు నిదర్శనం అంటూ శ్యామల పోస్ట్ చేశారు.

శివరాత్రి పూట రెడ్ బుక్ రాజ్యాంగంలో రెచ్చిపోతున్న చంద్రబాబు ప్రభుత్వం. రాజకీయ కక్ష సాధింపే లక్ష్యంగా అక్రమ అరెస్టులు చేస్తుంది. పోసాని కృష్ణమురళిని హైదారాబాద్‌లోని ఆయన ఇంట్లోకి అక్రమంగా చొరబడి పోలీసులు తనని అరెస్టు చేశారు అయితే తన అరెస్టు నోటీసులో కూడా రేపటి తేదీని వేసి ముందు రోజు రాత్రి ఆయనని అరెస్టు చేయడం ఇది కక్ష రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా ఉందని చెప్పాలి.