అనసూయ షాకింగ్ రిప్లై వైరల్..అండగా అందరూ..!

మన తెలుగు స్మాల్ స్క్రీన్ పైన హాట్ యాంకర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది అనసూయ అనే చెప్పాలి. తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్ ని అనసూయ బుల్లితెరపై ఏర్పర్చుకుంది. మరి అలాగే ఇక్కడ నుంచే సినిమాల్లో కూడా అద్భుతంగా రాణిస్తూ బిజీగా ఉంది.

అయితే అనసూయకి పలు వివాదాల్లో నానడం కూడా కొత్తేమీ కాదు ఇప్పటికే చాలా సార్లు సోషల్ మీడియాలో తన వ్యూ తో వైరల్ అయ్యింది. ఇక ఇదిలా ఉండగా రీసెంట్ గా ఓ స్టార్ సీనియర్ నటుడు తన డ్రెస్సింగ్ పై చేసిన కామెంట్స్ కు అనసూయ సాలిడ్ రిప్లై ఇచ్చింది. దీనితో చాలా మందే ఆమెకు అండగా ఉన్నామని చెబుతున్నారు. ఇంతకీ అందులో ఏముందంటే..

“ఓ సీనియర్ నటుడు నా డ్రెస్సింగ్ కోసం అసలే ఆలోచన లేకుండా మాట్లాడ్డం బాధించింది, డ్రెస్సింగ్ అనేది పూర్తిగా వ్యక్తిగతం పైగా నేనున్నా వృత్తిలో అది తప్పదు కూడా.. నేను ఒక తల్లిని అయినప్పటికీ కూడా వృత్తి రీత్యా ఇలా చేయాల్సొస్తుంది సరే ఇంకా ఎందరో నటులు ఉన్నారు. తమ కన్నా చిన్న వయసు ఉన్న హీరోయిన్స్ తో ఇప్పటికీ నటిస్తున్నారు. పెళ్లైన తర్వాత కూడా వారి సిక్స్ ప్యాక్ బాడీ చూపిస్తున్నారు. మరి అవి తప్పు కాదా? అదంతా నా వ్యక్తిగత జీవితం” అంటూ అనసూయ దుమ్ము దులిపేసింది. దీనితో కొంతమంది మళ్లీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నా ఎక్కువమంది ఆమెకు అండగా ఉన్నాం అని చెబుతున్నారు.