హైపర్ ఆది జబర్దస్త్ లో కనిపించకుండా పోవడానికి గల కారణం బయటపెట్టిన అనసూయ..!

బుల్లితెర మీద ప్రసారమౌతున్న టీవీ షో లో జబర్దస్త్ కామెడీ షో కొంతకాలం క్రితం వరకు టాప్ రేటింగ్ తో దూసుకుపోతూ నెంబర్ వన్ స్థానంలో ఉంది. అయితే కొంతకాలంగా జబర్దస్త్ పరిస్థితి చాలా దారుణంగా తయారయింది. ఈ షో లో ఉన్న ప్రముఖ కమెడియన్ ఇప్పుడు జబర్దస్త్ లో కనిపించడం లేదు. ప్రతి వారం జబర్దస్త్ స్టేజ్ మీద తన కామెడీ టైమింగ్ తో పంచులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆది ఇప్పుడు జబర్దస్త్ లో కనిపించడం లేదు. అంతేకాకుండా ఎక్స్ట్రా జబర్దస్త్ లో సందడి చేస్తున్న సుధీర్, గెటప్ శ్రీను కూడా కొంతకాలంగా జబర్దస్త్ కి దూరంగా ఉన్నారు.

ఇలా వీరందరూ జబర్ధస్త్ నుండి వెళ్లిపోవడంతో జబర్దస్త్ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. ఈ షో చూడటానికి ప్రేక్షకులు ఇప్పుడు ఎక్కువ ఆసక్తి చూపటం లేదు. ఇదిలా ఉండగా జబర్దస్త్ షో కి మూలస్తంభంలా ఉన్న ఆది ఇలా జబర్దస్త్ కి దూరం కావటానికి గల కారణం ఇప్పటి వరకు ఎవరికీ తెలియడం లేదు. కొందరు రెమ్యూనరేషన్ తక్కువగా ఇవ్వటం వల్ల ఆది జబర్దస్త్ కు దూరం అయ్యాడని అంటుంటే..మరికొందరు మాత్రం మల్లెమాల వారితో ఆదికి విభేదాలు ఉండటం వల్ల జబర్దస్త్ లో కనిపించడం లేదు అంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఈ విషయం గురించి అనసూయ ఒక క్లారిటీ ఇచ్చింది. ఒక ప్రైవేట్ పార్టీలో పాల్గొన్న అనసూయని కొందరు జబర్దస్త్ అభిమానులు ఈ విషయం గురించి అడగగా.. మొదట అనసూయ నిరాకరించింది కానీ తర్వాత ఆది జబర్దస్త్ నుండి వెళ్లిపోవడానికి గల కారణం గురించి చిన్న హింట్ ఇచ్చింది. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన ఆదికి సినిమా అవకాశాలు ఎక్కువ రావడం వల్ల రెండింటికీ సమయం కేటాయించటం కుదరక ఆది జబర్దస్త్ కు దూరమయ్యాడు అంటూ చెప్పుకొచ్చింది. కొంత కాలంలో పెద్ద స్టార్స్ సినిమాల్లో ఆదిని చూడబోతున్నారు అంటూ అనసూయ చెప్పుకొచ్చింది. దీంతో ఆది గురించి ప్రేక్షకులలో ఉన్న అనుమానాలకు క్లారిటీ వచ్చింది.