టాటూ కనపడేలా ఫోటోలకు ఫోజులిచ్చిన అనసూయా.. వైరల్ అవుతున్న ఫోటోలు…!

ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట ఒక న్యూస్ ఛానల్ లో న్యూస్ ప్రెజెంటర్స్ గా పనిచేసిన అనసూయ తర్వాత ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో లో యాంకర్ గా వ్యవహరిస్తూ మంచి గుర్తింపు పొందింది. దీంతో బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరించి ఛాన్స్ కొట్టేసింది. అనసూయ ఇలా టీవీ షోల ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.
యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ సినిమాలో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించిన అనసూయ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో నటించి అందరినీ మెప్పించింది. ఈ సినిమా ద్వారా అనసూయ రంగమ్మత్త గా బాగా గుర్తింపు పొందింది.

క్షణం, పుష్ప వంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలో నటించిన అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. ఒకవైపు టీవీ షోలు మరొకవైపు సినిమాలతో నిత్యం బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. అనసూయా అంటే అందం అనేలా ఫోటోలు, వీడియోలతో సోషియల్ మీడియాలో రచ్చ చేస్తోంది. కొన్ని సందర్భాలలో అనసూయా చేసే అందాల ఆరబోత వల్ల విమర్శలు కూడా ఎదుర్కొంది.
అయినప్పటకీ అనసూయ డ్రెస్సులు విషయంలో ఎటువంటి మార్పు రాలేదు. వయసు పెరిగే కొద్దీ తాను ఇద్దరు పిల్లల తల్లి అన్న విషయం కూడా మరచిపోయి తన అందాలతో కుర్రాళ్ళకి హీటెక్కిస్తోంది.

తాజాగా అనసూయా తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఫోటోలు సోషియల్ మీడియాలో వైరల్ గా మారాయి. అనసూయా తన ఎదపై రహస్యంగా ఉన్న టాటూ కనిపించేలా హాట్ ట్రెండీ వేర్ ధరించి టెంప్టింగ్ ఫోజులతో కుర్రాళ్ళని రెచ్చగొడుతు ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇదిలా ఉండగా అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప సినిమా సీక్వెల్ లో నటించటంతో పాటు పలు సినిమాలలో కూడ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో నటించిన దర్జా సినిమా టీజర్ కూడా విడుదల అయ్యింది. ఈ సినిమాలో అనసూయ లేడీరౌడీ పాత్రల్లో కనిపించనుంది.