Anasuya: బుల్లితెర యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించి బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి అనసూయ ఒకరు. జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్న అనసూయ ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకొని సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా పలు సినిమాలలో నటిస్తున్న ఈమెకు రంగస్థలం సినిమా మాత్రం ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది.
రంగస్థలం సినిమాలో అనసూయ రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించడంతో ఈమెకు మరిన్ని సినిమా అవకాశాలు వచ్చాయి. దీంతో అనసూయ బుల్లితెరకు గుడ్ బై చెబుతూ వెండితెర సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇండస్ట్రీలో స్టార్ నటిగా కొనసాగుతున్న అనసూయ భారీగానే సంపాదిస్తున్నారని చెప్పాలి.
ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా అనసూయ కొత్త ఇంటి గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.
అనసూయ తన భర్త ఇద్దరు పిల్లలతో కలిసి ఎంతో సాంప్రదాయబద్ధంగా నూతన గృహ ప్రవేశం చేశారని తెలుస్తోంది. ఇలా గృహ ప్రవేశ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను అనసూయ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ..ఆ సీతారామఆంజనేయ కృపతో.. మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో.. మీ అందరి ప్రేమతో, మా జీవితంలోని మరో అధ్యయనం వెలుగుచూసింది. శ్రీరామసంజీవని మా కొత్తింటి పేరు జైశ్రీరామ్ జైహనుమాన్. న్యూ బిగినింగ్స్ థాంక్ ఫుల్ హార్ట్ కృతజ్ఞత ఆశీర్వాదం అంటూ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.