అనసూయ కూడా కాపాడలేకపోయిందిగా.!

Anasuya Also Failed There | Telugu Rajyam

మాస్టర్ చెఫ్.. బుల్లితెరపై భారీ అంచనాలతో స్టార్ట్ అయిన ఓ వంటల ప్రోగ్రామ్. బుల్లితెరపై మామూలుగానే చాలా వంటల ప్రోగ్రాములు కుప్పలు తెప్పలుగా రన్ అవుతున్నాయ్. అయితే, నేషనల్ వైజ్‌గా ఏకంగా అందాల భామ మిల్కీ బ్యూటీ తమన్నాని రంగంలోకి దించి, బాహుబలి రేంజ్‌లో ప్రమోషన్లు చేసి ఈ షో స్టార్ట్ చేశారు.

తమన్నా రేంజ్ ఈ షోకి సరిపడలేదు. కాబోలు.. తమన్నా హోస్ట్‌గా ఈ షో ప్లాఫ్ అయ్యింది. తమన్నా తప్పుకోవడంపై రకరకాల ఊహాగానాలో, నిజాలో చక్కర్లు కొట్టాయనుకోండి. అది వేరే సంగతి. ఆ తర్వాత హాట్ యాంకర్ అనసూయను పెట్టి ఈ షో రన్ చేశారు మాస్టర్ ఛెఫ్ నిర్వాహకులు.

ఏదో అలా.. అలా అనసూయతో రన్ అవుతున్న ఈ షో పెద్దగా ఆదరణ దక్కించుకోలేకపోయింది. అనసూయ తన స్టైల్‌లో అందాలారబోసినా, మాటల్లో ఆటిట్యూడ్ చూపించినా, కూడా పాపం ఈ షోని పట్టించుకునే నాధుడే లేకపోయాడు. సో రెస్పాన్స్ చూస్తుంటే, త్వరలోనే మాస్టర్ ఛెఫ్ షోని క్యాన్సిల్ చేసే యోచనలో నిర్వాహకులున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుందో.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles