ఆనందయ్య నాటు మందు.. వుందా.? అసలుందా.?

Anandayya Has Made A Big Mistake

Anandayya Has Made A Big Mistake

కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మార్మోగిపోయిన పేరు ఆనందయ్య నాటు మందు. దీన్ని దివ్యౌషధంగా అప్పట్లో ప్రచారం చేశారు చాలామంది. కరోనా పేషెంట్లు ఆసుపత్రులు ఖాళీ చేసి మరీ, నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం వెళ్ళి ఆనందయ్య నాటు మందుని వేసుకునేందుకు పోటీ పడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పట్లో ఆనందయ్య నాటు మందుకి పరోక్షంగానే అయినా విపరీతమైన పాపులారిటీ ఇచ్చింది. కానీ, అనూహ్యంగా ఆనందయ్య నాటు మందుపై ప్రచారం సన్నగిల్లింది. వెబ్‌సైట్ ప్రారంభించి, ఆన్‌లైన్ ద్వారా ఆనందయ్య నాటు మందుని అందరికీ అందేలా చూసేందుకూ ప్రయత్నాలు జరిగాయి.

కానీ, అవేవీ వర్కవుట్ అవలేదు. కానీ, ఆనందయ్య నాటు మందు పేరుతో తెలుగు రాష్ట్రాల్లో తెరవెనుక పెద్ద బాగోతమే నడుస్తోంది. అడ్డగోలుగా ఆనందయ్య నాటుమందుని అమ్మేస్తున్నారు. వీటిల్లో చాలావరకు నకీలీవే. ఈ వ్యవహారంపై ఆనందయ్య తాజాగా స్పందించారు. నకిలీ నాటు మందులతో ప్రాణాపాయం ఎవరికైనా కలిగితే తనకు సంబంధం లేదన్నారాయన. ప్రభుత్వం ఈ విషయమై జోక్యం చేసుకోవాలన్నారు.

అసలు, ఆనందయ్యకు అంతలా ప్రత్యేక గౌరవం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆయన్నెందుకు లైట్ తీసుకుంది.? అంటే, దానికీ కారణాలు లేకపోలేదు. ఆనందయ్య చుట్టూ రాజకీయాలు నడిచాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ప్రభుత్వం సహకరించడంలేదంటూ ఆరోపణలు చేయడం మొదలెట్టారాయన.

దానికి తోడు, ఆనందయ్య నాటు మందు వల్ల కరోనా రాదనిగానీ, వచ్చిన కరోనా తగ్గిపోయిందనిగానీ చెప్పడానికి శాస్త్రీయమైన ఆధారాల్లేకపోవడంతో ప్రభుత్వం రిస్క్ చేయలేదు. అదే ఆనందయ్య, ప్రభుత్వానికి సహకరించి వుంటే.. పరిస్థితి ఇంకోలా వుండేదే. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకునే అవకాశాన్ని ఆనందయ్య చేజేతులా నాశనం చేసుకున్నారు.