సోషల్ మీడియాలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఎంత యాక్టివ్ గా ఉంటారు అనేది అందరికీ తెలిసింది. అప్పుడప్పుడు తనని ఎట్రాక్ట్ చేసే విషయాలను ఆనంద్ మహీంద్రా పంచుకుంటారు. ఆ ట్వీట్ లు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ఆనంద మహేంద్ర ట్విట్టర్ లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.
దానిని రాజమౌళికి ట్యాగ్ చేశారు. భారతీయ సమాజంలో అత్యంత పురాతనమైన సింధులోయ నాగరికత గురించి పరిశోధన చేసి ఒక మంచి చిత్రాన్ని చేయాలని పేర్కొన్నారు. అప్పటి ఆ నాగరికతపై మంచి కథతో మూవీ చేస్తే ప్రస్తుత సమాజంలో చాలామందికి గొప్ప విజ్ఞానాన్ని అందించినట్లు అవుతుంది అని అన్నారు.
ఇక ఆనంద్ మహీంద్రా ట్వీట్ పై రాజమౌళి రియాక్ట్ అయ్యారు. మగధీర సినిమా షూటింగ్ సమయంలో తాను గుజరాత్ లోని దొలవీర వెళ్లానని, అక్కడ కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి చెట్టు శిలాజాన్ని చూడటం జరిగింది. ఆ సందర్భంగా ఇండస్ సివిలైజేషన్ సంబంధించి కథ చేయాలని ఆలోచన వచ్చిందని అన్నారు.
ఓ దాని గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడం కోసం మోహింజదారో వెళ్లడానికి పర్మిషన్ కోసం ప్రయత్నం చేశాను. అయితే తన పర్మిషన్ ని పాకిస్తాన్ గవర్నమెంట్ తిరస్కరించింది. కానీ ఖచ్చితంగా మీరు సూచించిన అంశాలపై మరింత లోతుగా పరిశోధన చేసే ప్రయత్నం చేస్తాను అని చెప్పారు. సింధులోయ నాగరికత గురించి నిజంగా అద్భుతమైన కథతో రాజమౌళి లాంటి దర్శకుడు నుంచి మూవీ వస్తే కచ్చితంగా వండర్ అవుతుందని చెప్పొచ్చు.
అప్పటి నాగరికత, పట్టణీకరణ, ప్రజల జీవన వైవిధ్యం గురించి మరల ప్రజలకు గొప్ప విజ్ఞానాన్ని అందించినట్లు అవుతుంది. రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో మూవీ చేసే ప్లాన్ లో ఉన్నారు. దీని తర్వాత సింధులోయ నాగరికత బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తే చూడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ హీరోగా మొహంజదారో అనే సినిమా వచ్చింది. అయితే సిల్వర్ స్క్రీన్ ఆ చిత్రాన్ని ఆవిష్కరించడంలో సక్సెస్ కాలేకపోయారు.