Prabhas World Project Director : వైరల్ : మహీంద్రా ఓనర్ కి ప్రభాస్ వరల్డ్ ప్రాజెక్ట్ దర్శకుడి రిక్వెస్ట్.!

Prabhas World Project Director

Prabhas World Project Director : ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఉన్నపుడు ఓ సినిమా స్థాయి ఇప్పుడు మరో స్థాయిలోకి వెళ్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనితో ప్రభాస్ బ్రాండ్ వాడుకోడానికి అనేక మంది కూడా పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. మరి ఇదిలా ఉండగా తన సినిమాల్తో పాటుగా కొన్ని యాడ్స్ కూడా చేసాడు. కాకపోతే అవి తక్కువే ఉన్నాయి.

మరి ఈ యాడ్స్ లో ప్రముఖ కార్ బ్రాండ్ మహీంద్రా కూడా ఒకటి. అప్పట్లో బాహుబలి సినిమా టైం లో ప్రభాస్ చేసిన ఆ యాడ్ మంచి సెన్సేషన్ కూడా అయ్యింది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న పలు బిగ్గెస్ట్ చిత్రాల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ తో భారీ తారాగణం తో చేస్తున్న సినిమా అందులోని ప్రపంచ స్థాయిలో చేసినది “ప్రాజెక్ట్ కే” ఒకటి.

ప్రభాస్ నుంచి అనౌన్స్ చేసిన ఫస్ట్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ఇది. మరి ఈ సినిమా స్కై ఫై థ్రిల్లర్ గా చేస్తుండగా దర్శకుడు నాగ్ అశ్విన్ లేటెస్ట్ గా ఓ పోస్ట్ పెట్టడం ఆసక్తిగా మారింది. భారతీయ కార్ల బ్రాండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా కి ట్యాగ్ చేసి మా సినిమా అమితాబ్, ప్రభాస్, దీపికా పదుకొనె లాంటి నటులు చేస్తున్న ప్రపంచ స్థాయి ప్రాజెక్ట్ లో చాలా మంది ఇంజనీర్స్ చాలా అత్యుత్తమమైన డిజైన్స్ మా సినిమా కోసం తయారు చేసారని.

ఇవన్నీ రేపు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయని అంటున్నాడు మరి ఇలాంటి టాలెంట్ ఉన్న మన ఇంజనీర్స్ కి మీరు కూడా సహకారం అందిస్తే తప్పకుండా మన దేశానికి గర్వకారణంగా నిలుస్తారని అందుకే తమ కంపెనీ తరపు నుంచి ఒక సహకారం కావాలని రిక్వెస్ట్ చేసాడు. దీనితో ఈ పోస్ట్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి దీనిపై ఆనంద్ మహీంద్రా ఏమన్నా రిప్లై ఇస్తారేమో అని కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.