టచ్ మీ నాట్ అంటున్న ఆనం వారు

కాలం కర్మం కలిసి రాకపోతె ఎంతటి వాళ్లు అయినా ఏం చేస్తారు చెప్పండి. ఇక రాజకీయాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో హవా నడిపించిన ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా ఏదో ఉన్నావా అంటే ఉన్నాను అన్న తీరుగా వ్యవహరిస్తున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచినా పూర్తిగా సైలెంట్ అయ్యారు ఈ మాజీ మంత్రి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనుచరణ గణం ఉన్నా కేవలం తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. ఏకంగా పార్టీ అధిష్టానమే తనని దూరం పెట్టడంతో తాను కూడా అందరికా దూరంగా ఉంటున్నారంటా. తన సిఫారసులను అధికారులు లెక్కచేయకపోవడంతో అటు అధికారులతో పనులు చేయించుకోలేక ఇటు ప్రజలకు సమాధానం చెప్పలేక మౌనం దాల్చారంటా. ఇక దీన్ని అసరా చేసుకొని ఆనం వారు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని పార్టీలో మరో వర్గం ప్రచారం చేయడంతో మరింత హర్ట్ అయ్యారు. ఇక ఆతర్వాత పార్టీ కార్యక్రమాలకు కూడా పూర్తిగా దూరంగా ఉంటున్నారంటా. ఇటీవలే పార్టీ అధినేత జగన్ తో భేటీ అయిన తర్వాత పరిస్థితిలో కొంత మార్పు వచ్చినా వైరి వర్గం మళ్లీ తనను కార్నర్ చేస్తుండడంతో చేసేది లేక మళ్లీ సైలెంట్ అయ్యారంటా. దీంతో నెల్లూరులో ఇప్పుడు టాక్ మొదలైంది. ఆనం రామనారాయణ రెడ్డికి పార్టీ మారే ఇష్టం లేకపోయినా….వైరి వర్గం మారేటట్లు చేస్తోందనే టాక్ నడుస్తోంది. జగన్ హయాంలో చాలా మంది సీనియర్ మోస్ట్ పొలిటీషిన్లకు కళ్లెం పడ్డట్లే ఈయనకు కూడా బ్రేకులు పడ్డాయని ప్రచారం జరుగుతోంది.