ఆ పెద్ద కుటుంబం కంప్లీట్లీ ఎగైనెస్ట్ టూ జగన్ 

AP Venkataeswararao condemns AP government suspension orders 
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబానికి మంచి పేరుంది.  పూర్వం ఉన్న హవా ఇప్పుడు లేదు కానీ కేడర్ మాత్రం పదిలంగానే ఉంది.  కాంగ్రెస్ పార్టీలో ఉండగా  జిల్లా రాజకీయాలను శాసించారు ఆనం సోదరులు.  కాంగ్రెస్ పతనమవడం, ఆనం వివేకానందరెడ్డి మరణంతో వారి చరిష్మా కూడ తగ్గింది.  ప్రస్తుతం వీరి కుటుంబం నుండి ఇద్దరే రాజకీయాల్లో ఉన్నారు.  ఒకరు ఆనం రామనారాయణ రెడ్డి.  ఈయన వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఉండగా ఇంకొకరు ఆనం వెంకటరమణారెడ్డి.  ఈయన టీడీపీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.  టీడీపీలో ఉన్నారు కానట్టి వెంటరమణారెడ్డి వైసీపీకి, జగన్ కు వ్యతిరేకం కావడంలో అర్థముంది.  కానీ పార్టీలోనే ఉంటూ జగన్ మీద అసంతృప్తితో రగులుతున్న రామనారాయణరెడ్డి.  ఈయన అసంతృప్తికి కారణం పార్టీలో ప్రాముఖ్యత లేకపోవడమే.  
 
Anam family completely against to YS Jagan
Anam family completely against to YS Jagan
 
సీనియర్ నాయకుడు అయినప్పటికీ జగన్ పెద్దగా పట్టించుకోవట్లేదని, మంత్రి పదవి ఇవ్వలేదని, ఒకప్పుడు తమ కుటుంబం అండతో రాజకీయాల్లోకి వచ్చిన వారే ఈరోజు తమ నెత్తిన కూర్చుని తమనే శాసిస్తున్నారనేది రామనారాయణరెడ్డి బాధ. ఇక రెండవ తరం నాయకులు కూడ వైసీపీ మీద గుర్రుగానే ఉన్నారు.  అనిల్ కుమార్ యాదవ్ దూకుడును తమ మీద చూపిస్తున్నారని మండిపడుతున్నారు.  ఇక టీడీపీలో ఉన్న వెంకటరమణారెడ్డి అయితే స్వేచ్ఛగా జగన్ మీద యుద్ధం చేసేస్తున్నారు.  ప్రతి విషయంలోనూ జగన్ ను తీవ్రంగా విమర్శిస్తున్నారు.  తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా జగన్ కు అసలు ఒక గోత్రం అంటూ ఉందా అని ఎద్దేవా చేశారు. 
 
గోత్రంలేని సీఎం జగన్‌రెడ్డికి మతాల గురించి ఏమీ తెలుసు.  వైసీపీ మ్యానిఫెస్టోని సీఎం జగన్ పవిత్ర మత గ్రంధాలతో పోలుస్తారా.  హిందూ దేవుళ్ల డబ్బుని నవరత్నాలకి వినియోగించే హక్కు ఎవరిచ్చారు.  ఆ నిధులు ఆలయాలకి హిందువులిచ్చిన విరాళాలు.  దేవాదాయశాఖ నిధులను బ్రాహ్మణ కార్పొరేషన్‌కి, అక్కడి నుంచి పీడీ అకౌంట్లకి తరలించి డ్రా చేశారని, ముస్లింల సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన మైనార్టీ వెల్ఫేర్ నిధులనూ నవరత్నాలకి కేటాయించారని మండిపడ్డారు.  ఇక వివేకా కుమారుడు రంగమయూర్ రెడ్డి అయితే అనిల్ కుమార్ యాదవ్ అంటేనే ఇంతెత్తున లేస్తున్నారు.  మొన్నామధ్యన ఆనం పుట్టినరోజు సందర్బంగా రెజినా ఫ్లెక్సీల గొడవలో ఓపెన్ వార్నింగ్ ఇచ్చేశారు.  ఈ రకంగా జిల్లా రాజకీయాల్లో పేరున్న ఆనం కుటుంబ కంప్లీట్లీ అగైనెస్ట్ టూ జగన్ అంటోంది.  ఏమాత్రం వీలుదొరికినా వైసీపీని  వెనక్కు నెట్టాలని చూస్తోంది.