జగన్ దగ్గర అర్జెంట్ అపాయింట్‌మెంట్ కోరుతున్న అంబటి రాంబాబు ?

Ambati Rambabu wants to meet YS Jagan immediately
వైసీపీ కీలక నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు కు కష్టాలు మొదలయ్యాయా.. ఆయనకు సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గం తయారైందా అంటే అవుననే అనేట్టుగా ఉంది వాతావరణం.  వైఎస్ జగన్ తరపున వాకాల్తా పుచ్చుకుని ప్రత్యర్థులను విమర్శలతో చిత్తు చేయడంలో అంబటి చాలా గట్టివారు.  అందుకే వైఎస్ జగన్ వద్ద ఆయన మాటకు కొంత విలువ ఉంది.  అసలు సత్తెనపల్లిలో ఆయనకు టికెట్ ఇవ్వడం స్థానికంగా ఉన్న కొన్ని వర్గాలకు నచ్చలేదు.  వ్యతిరేకించారు.  స్థానికేతరుడైన రాంబాబుకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.  కానీ జగన్ అంబటి వైపే నిలబడ్డారు.  ఆయనకు టికెట్ కేటాయించి ఆయన గెలుపు మీద శ్రద్ద చూపారు.  అందుకే రాంబాబు బొటాబొటీ మెజారిటీతో గట్టెక్కగలిగారు. 
Ambati Rambabu wants to meet YS Jagan immediately
Ambati Rambabu wants to meet YS Jagan immediately
 
గెలుపు అనంతరం అంబటి రాంబాబు నియోజకవర్గంలో తనా హవా ప్రదర్శించారు.  వ్యతిరేకులను తొక్కే ప్రయత్నం చేశారనే ఆరోపణలు కూడ ఉన్నాయి.  కానీ ఆయన వ్యతిరేకులు మాత్రం తగ్గలేదు.  ఆ వ్యతిరేక వర్గానికి నేతృత్వం వహిస్తున్న నాయకుడికి పార్టీలోని పెద్ద తలలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయట.  తనకు, తన వారికి కావలసిన పనులన్నీ నేరుగా పైనుండే చక్కబెడుతున్నారట ఆయన.  ఈ క్రమంలో రాంబాబు సోదరుడు నియోజకవర్గంలో అంతా తానే అన్నట్టు వ్యవహరిస్తుండటం ఆ వ్యతిరేక వర్గానికి అస్సలు నచ్చలేదట.  అంబటి సైతం సోదరుడికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చేసి కీలక కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ చేయడం వ్యతిరేక వర్గానికి మరింత అసహనాన్ని తెప్పించింది. 
 
ఆ అసహనంతోనే సొంత పార్టీ కార్యకర్తలతో అంబటి రాంబాబు గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం కోటనెమలిపురి, కుబాదుపురం గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్ చేస్తున్నారని కోర్టులో పిల్ వేశారు.  ఈ పరిణామంతో అంబటి సైతం షాక్ తిన్నారట.  ఇన్నాళ్లు పార్టీ వరకే పరిమితమైన వ్యతిరేకులు ఇప్పుడు నేరుగా తన మీద అవినీతి ఆరోపణలు చేస్తూ కోర్టుకు వెళ్ళడంతో అంబటి రాంబాబు అలర్ట్ అయ్యారట.  ఇక ఈ విషయాన్ని తాను డీల్ చేస్తే కుదరదని, పంచాయితీని అధినేత వైఎస్ జగన్ ముందే తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారట.  అందుకే ఉన్నపళంగా సీఎం  అపాయింట్‌మెంట్ కోసం ట్రై చేస్తున్నారట.  అంబటి లాంటి ఘటికుడినే కంగారుపడేలా చేస్తున్నారు అంటే ఆ వ్యతిరేకవర్గంలో ఉన్న నేత ఎవరు, ఆయనకు అండగా ఉంటున్న పెద్ద తలలు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.